Cars Fire: సిగ‌రెట్ ముక్క‌తో రెండు కార్లుకు అంటుకున్న నిప్పు!

Cars Fire | నిప్పు అంటుకుని రెండు కార్లు పూర్తిగా ద‌గ్ధ‌మైన సంఘ‌ట‌న పీలేరు ప‌ట్ట‌ణం పీలేరు-తిరుప‌తి మార్గంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ స‌మీపంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. Pileru ప‌ట్ట‌ణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ స‌మీపంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. పీలేరు ప‌ట్ట‌ణంలో R&B గెస్ట్ హౌస్ స‌మీపంలో ఓ మెకానిక్ షెడ్ వ‌ద్ద రెండు Cars పార్కింగ్‌ చేసి ఉన్నాయి. ప‌క్క‌నే చెత్త కుప్ప‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వేసిన సిగ‌రెట్ ముక్క అగ్గి రాచుకుంది. అది కాలుకుంటూ కార్లు (Cars Fire)కు నిప్పు అంటుకోవ‌డంతో స్థానికులు గ‌మ‌నించారు.

వెంట‌నే అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. వారు వెంట‌నే స్పందించి మంట‌ల‌ను ఆర్పేశారు . అయితే అప్ప‌టికే కార్లు స‌గం వ‌ర‌కు కాలిపోయాయి. ఈ కార్లు ఎవ‌రివి అనేవి తెలియ‌దు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కార్య‌క్ర‌మంలో ఫైర్ సిబ్బంది విజ‌య భాస్క‌ర్ రెడ్డి, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ అల్లాభ‌క్షు, వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Comment