Car accident: పెద్దపల్లి : చెరువులో కారు.. విగతజీవిగా కనిపిస్తున్న యువకుడి మృతదేహం…ఈ దృశ్యం చూసిన వారి మనసులను కలిచివేసింది. రాఖీ పండుగ రోజున ఆదివారం ఆ ఇంట విషాదం నింపింది. అప్పటి వరకూ కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడిపిన యువకుడు ఘోర ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. చివరకు చెరువులో శవమై కనిపించాడు.
పండగ పూట పెద్దపల్లి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. బంధువులను ఇంటి వద్ద దింపేందుకు కారులో వెళ్లిన యువకుడు ఘోర ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి వస్తుండగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టింది. దీంతో పక్కనే ఉన్న చెరువులోకి కారు(Car accident) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చెరువులో పడిన కారు, అందులో అతని మృతదేహం తేలుతూ కనిపించడంతో చూపురులను కలిచివేసింది. సేకరించిన వివరాల మేరకు…


కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రాములపల్లికి చెందిన వేల్పగొండ రాకేష్ అనే యువకుడు తమ బంధువులను వదిలి పెట్టేందుకు కారులో పెద్ద పల్లి జిల్లా సుల్తానాబాద్ వెళ్లాడు. అక్కడ వారిని దించి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓదెల మండలం కనగర్తి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. అమాంతం దూసుకెళ్లి చెరువులో పడింది. చెట్టును బలంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. కారు పూర్తిగా ధ్వంసమైంది. చెరువులో కారు, యువకుడి మృతదేహం చూసి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోత్కపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!