car accident: కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేదు. వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి వెళ్లారు. తిరుగు ప్రయాణం లో ఊహించని సంఘటన. రాత్రి కురిసిన ఎడతెరపిలేని భారీ వర్షంకు వాగులు ఉప్పొంగు తున్నాయి. కారు డ్రైవర్ సాహసించి నడిపాడు. కానీ దురదృష్టం వెంటాడింది. కారు వాగు(car accident)లో కొట్టుకు పోయింది. సరిగ్గా అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కేకలు, ఆర్తనాదాలు వినిపించాయి. చివరకు ఏం జరిగిందంటే!
వాగులో కొట్టుకుపోయిన కారు
అన్నమయ్య జిల్లాలో గత రాత్రి వాగులో కారు (car accident) గల్లంతయ్యింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పెద్దతిప్పసముద్రం మండలం సంపతికోట సమీపంలో అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో వాగులో కారు కొట్టుకుపోయింది. రాత్రి అంతా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో బి.కొత్తకోట మండలం తోకలపల్లెకు చెందిన రమణ(45) భార్య ఉమాదేవి(37), కూతురు మౌనిక(22), తమ్ముడు శ్రీనివాసులు (39)తో పాటు కారు నడిపే డ్రైవర్ కలిసి ఉమాదేవికికి వైద్యం చేయించేందుకు బెంగళూరు ఆసుపత్రికి వెళ్లారు.


శనివారం రాత్రి తిరుగు ప్రయాణం చేస్తుండగా పెద్దతిప్ప సముద్రం మండలం సంపతి కోట సమీపంలో అర్థరాత్రి వారి కారు (car accident) వాగులో కొట్టుకుపోయింది. వారు వెనుక మరొక కారులో వస్తున్న వారు గమనించారు. కేకలు, ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు ఉలిక్కిపడి అక్కడికి చేరుకున్నారు. అతి కష్టం మీద తాళ్లు, లైట్లు సాయంతో రాత్రి 2 గంటల సమయంలో వారిని రక్షించారు. కానీ కూతురు మౌనిక వాగులో కొట్టుకు పోయింది. ఆమెను PTM ఎస్సై మధు రామచంద్రుడు బి.కొత్తకోట ఎస్సై రామ్మోహన్ బృందం రెస్క్యూ ఆపరేషన్ చేసి మృతి చెందిన బీటికె్ విద్యార్థిని మౌనిక మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. కాగా రమణ కుటుంబంబి.కొత్తకోటలో విద్యార్థి కాన్సెప్ట్ అనే పేరుతో ప్రైవేటు స్కూలును నిర్వహిస్తున్నారు.