camel explode | చనిపోయిన ఒంటె వద్దకు అసలకి వెళ్లకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఒంటెలు పెంపుడు జంతు వులు. ఇవి బరువులు మోయడానికి, ట్రావెలింగ్ చేయడానికి సహాయ పడతాయి. వీటికి ఉన్న స్పెషాలిటీ కాళ్ళు అని చెప్పవచ్చు. దేవుడు ఒంటెలను ఇసుకలో కూడా నడవడానికి వాటి కాళ్లను ప్రత్యేక తయారు చేశాడేమో. ఒంటె ఒక్కసారి 110 లీటర్లను తాగి తన శరీరంలో దాచుకోగలదు.
ఒంటె చనిపోతే అది అంత ప్రమాదమా!
ఏదైనా ఒంటె చనిపోతే దాని బాడీ(camel explode) వద్దకు అసలకి వెళ్లకూడదు. దాని దగ్గరకు కూడా వెళ్లకూడదు. ఎందుకంటే చనిపోయిన ఒంటె బాడీని టచ్ చేస్తే పెద్ద విస్పోటనమే జరుగుతుంది. ఏడారిలో నీటి చుక్క లేకుండా ఏ జీవి ప్రాణాలతో బ్రతకలేదు. కానీ అదే ఏడారిలో ఈ ఒంటె తన మనుగడను సాగిస్తుంది. ఎడా రిలో నివసించే వారికి ఒంటె ఒక అపూరమైన వాహనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎడారిలో నివసించే వారు ఒంటె లేకుండా ప్రయాణం చేయడం కష్టం. ఒంటెను ఎడారి ఓడ అని కూడా పిలుస్తారు. ఎడారిలో బ్రతకడానికి దేవుడు దానికి అన్ని ఫీచర్స్ కల్పించాడు.

ఒంటె నీళ్లు, ఆహారం లేకుండా కొన్ని రోజుల వరకు పని చేయగలదు. బ్రతకగలదు. ఒంటె వీపు భాగాన ఎత్తుగా ఉంటుంది. దీనిని మోపురం అని అంటారు. ఈ మోపురంలో కొవ్వు నిల్వ చేసుకుంటుంది. ఏడారి ప్రాంతంలో నీరు లేని సమయంలో ఒంటె ఈ ఫ్యాట్‌ను ఉపయోగించుకొని జీవిస్తుంది. ఈ కొవ్వు కరిగి ఎనర్జీగా మారుతుంది. ఒంటె ఎర్రటి ఎండలో కూడా చాలా చలాకీగా పనిచేస్తుంది. ఎప్పుడూ కూడా తన యజమానిని నిరాశ పర్చదు. కానీ ఈ ప్రత్యేకతలే ఒంటె చనిపోయిన తర్వాత బాంబ్‌లాగా రూపం దిద్దుకుంటుంది.
ఒంటె బాడీ టచ్ చేస్తే ఏమౌతుంది?
ఒంటె(camel dead) చనిపోతే దాని డెడ్‌బాడీ కొన్ని రోజుల వరకు అలానే పడివుంటుంది. మనకు తెలిసి ఏ జీవి అయినా మృతి చెందింతే కొన్ని బ్యాక్టీరియాలు దాని బాడీ(body)లోకి చేరి డీకంపోజ్ చేస్తాయి. కానీ ఒంటె చనిపో యినప్పుడు దాని మోపురంలో ఉన్న కొవ్వు నీటిలో కలిసి ఒక భయంకరమైన రియాక్టర్ గ్యాస్‌గా రూపుదిద్దుకుంటుంది. అదే మిథేన్ గ్యాస్‌గా మారుతుంది. అదే విధంగా బాడీలో బ్యాక్టీరియా, మైక్రో ఆర్గనిజమ్స్ యాక్టివ్ అవుతాయి. ఇవి లోలోపలే పెద్ద విస్పోటనానికి రెడీ అవుతాయి. ఇటువంటి స్విచ్వేషన్లో బయట ఎవరైనా బాడీని టచ్ చేస్తే పెద్ద విస్పోటనం జరిగి పేలిపోతుంది.

ఒంటె డెడ్ బాడీ విస్పోటనం జరిగిన తర్వాత ప్రేగుల్లో మురుగు నీరు అంతా బయటకు వస్తుంది. దాని తర్వాత కొన్ని విషవాయువులు విడుదలవుతాయి. ఇవి మనిషి అత్యంత ప్రమాదకరం. ఎక్కడైనా ప్రమాదకరమైన గ్యాస్ పీలిస్తే ప్రాణాలు ఎంత ముప్పు వాటిల్లుతుందో ఒంటె బాడీ నుంచి వచ్చే గ్యాస్ కూడా అంతకన్నా ప్రమాదకరంగా ముప్పు కలిగిస్తుంది. ఎడారిలో ఒంటెలు వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నాయి. ఇంతకు ముందు ఇవి నీటిని వెతుక్కుంటూ ప్రయాణం చేసేవి. మనుషులు ఎప్పుడైతే మచ్చిక చేసుకున్నారో అప్పటి నుండి నీటిని వెతికే అలవాటును మరిచిపోయాయి ఒంటెలు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని ఒంటెలూ తన యజమానులపై ఆధారపడి జీవిస్తున్నాయి.
మనిషిపై ఆధారపడుతున్న ఒంటె
దాని యజమాని వాటికి నీటిని తాగించినప్పుడే త్రాగుతున్నాయి. లేకుంటే అలానే ఉండిపోతున్నాయి. ఒక్కొక్కసారి ఎడారిలో నీరు కనిపించవు. మనుషులు కూడా తాగడానికి కనిపించవు. అలాంటి సమయంలో అవి నీటిని తాగకుండా అలానే ఉంటాయి. ఇలా కొన్ని రోజులు నీటిని తాగకుండా ఉండటంతో ప్రాణాలు విడుస్తాయి. ఇక కొన్ని నీటి కోసం అటూ ఇటూ పరుగులు పెట్టి చివరకు అలసిపోయి తుది శ్వాస విడుస్తాయి. ఒంటెలు మనుషులు తుమ్మినట్టే తుమ్ముతాయి. కొన్ని సార్లు మనుషులను భయపెట్టడానికి మనుషుల మీద తుమ్ముతాయి. అలా శత్రువును భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తాయి తప్ప కావాలని తుమ్మవు.

ఒంటెకు ఉన్న ప్రత్యేకతలు
ఈ దునియాలో ఏ జంతువూ బ్రహ్మజెముడు ను డైరెక్టగా తినలేదు. కానీ ఒంటె మాత్రం బ్రహ్మజెముడు మొక్కను, ముళ్లతో సహా అమాంత తింటాయి. ఒంటె పెదాలు చాలా దృఢంగా ఉంటాయి. ముళ్లు ఉన్న చెట్లను సైతం తినగలవు. ఒంటె కంటికి మూడు లేయర్ల పొర ఉంటుంది. కాబట్టి ఇవి ఎడారిలో ఇసుక తుఫానులు వచ్చిన తమ ప్రయాణం కొనసాగిస్తాయి. ఒంటెలకు ఎండ ఎక్కువుగా తగలదు. వాటి శరీరం ఎక్కువుగా మందంగా ఉండటం వల్ల వాటికి వేడి తగలదు. కన్నీరు పెట్టించే విషయం ఏమిటంటే ఎడారిలో కొందరు వ్యక్తులు నీటి కోసం ఒంటెలను చంపి మోపురంలో ఉన్న నీరు తాగాలని చూస్తారు. చివరకు నీరు దొరకదు కానీ ఒంటెలు మాత్రం చనిపోతున్నాయి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!