Camel Diseases | మానవుల్లో జలుబు అనేది చాలా సాధారణ రుగ్మత. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ దీనివల్ల కలిగే చికాకు అంతా ఇంతా కాదు. ఈ జలుబు కారక వైరస్ Camels నుంచి మానవుల్లోకి సంక్రమించినట్లు ఓ అధ్యాయనంలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు Corona వైరస్‌లు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి Rhinovirusలుగా పేర్కొంటారు. Coldకు ఇవే కారణం. ఈ వైరస్‌లతో తలెత్తే ఇన్ఫెక్షన్లు సాధారణంగా ప్రాణహాని కలిగించవు. వీటిలో ఒకటైన HCVV-229E ఎక్కడి నుంచి వచ్చిందన్నది తేల్చేందుకు జర్మనీలోని Bon విశ్వవిద్యాలయ ఆసుపత్రి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
ప్రమాదకరమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వైరస్ తరాలో ఇది కూడా ఒంటెల నుంచి(Camel Diseases) వచ్చిందని పరిశోధనలో పాల్గొన్న క్రిస్టియన్ డ్రోస్టెన్ చెప్పారు. ఎంఈఆర్ఎస్ కరోనా వైరస్‌ను తొలిసారిగా 2012లో మానవుల్లో కనుగొన్నారు. దీనివల్ల శ్వాసకోశంలో తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. కొన్నిసార్లు ప్రాణాంతకం కావొచ్చు. ఎంఈఆర్ఎస్‌పై పరిశోధనలు సాగినప్పుడు దాదాపు వెయ్యి ఒంటెలను పరిశీలించామని డ్రోస్టెన్ చెప్పారు.


వాటిలోని కరోనా వైరస్‌ల గురించి శోధించాం. మానవుల్లో జలుబును కలిగించే హెచ్‌సీవోవీ-229ఈ వైరస్‌కు సంబంధించిన పరాన్నజీవి వీటిలో వెలుగు చూడటం ఆశ్చర్యాన్ని కలిగిందని వైద్యులు పేర్కొన్నారు. దాదాపు ఆరు శాతం కేసుల్లో ఇది కనిపిందని పేర్కొన్నారు. దీన్ని నిర్థారించుకోవడానికి గబ్బిలాలు, మానవులు, ఒంటెల్లోని జలుబు Virusలు పరమాణు జన్యువిశ్లేషనలు జరిపి, ఆ వివరాలను పోల్చి చూశారు. ఒంటెల నుంచే మానువులకు ఈ జలుబు వైరస్ వచ్చినట్టు ఇందులోనూ తేలిందని వైద్యులు తెలిపారు.