Cambodian Rat అది సాధారణ ఎలుక కాదు. కాంబోడియాలో దాదాపు మందు పాతరలను గుర్తించి ఎంతో మంది జీవితాలను కాపాడింది. తన సేవలకు గోల్డ్ మెడల్ కూడా అందుకుంది. మానవజాతికి ఎంతో సేవ చేసిన మూషికం మగువా రిటైర్మెంట్ జీవితం గడుపుతూ చివరకు కన్నుమూసింది.ఎలుకే కదా అని తేలికగా తీసుకోకండి. ఇది మామూలు మూషికం కాదు. మందుపాతరలను గుర్తించడం దానికి వెన్నతో పెట్టిన విద్య.

కాంబోడియా మగావా
ఈ మూషికం మందుపాతరలను క్షణాల్లో గుర్తిస్తుంది.(Cambodian Rat) నిపుణులు వాటిని వెలికి తీసి నిర్వీర్యం చేసేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందింది మగువ. ఈ పనితో ప్రపంచ వ్యాప్తం గుర్తింపు కూడా పొందింది. ఎన్నో ప్రశంసలను కూడా అందుకుంది. టాంజానియాలో 2013లో ఈ ఎలుక పుట్టింది. దీనికి మగావా అనే పేరు పెట్టారు. మందుపాతలను వాసన ద్వారా గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందింది. మగావాను 2016లో కాంబోడియాకు పంపారు. కాంబోడియాలో మూడు దశాబ్ధాల పాటు అంతర్యుద్ధం కొనసాగింది. 1998లో ఆ యుద్ధం ముగిసినా, నేలలో పాతి పెట్టిన మందు పాతరలు ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ఈ మందు పాతలను గుర్తించడమే మగావా పని.
100 మందు పాతరులు గుర్తింపు
మగావా తనకు అప్పగించిన పనితో ఎన్నో విజయాలను సాధించింది. దాదాపు 100 మందు పాతరలను గుర్తించింది. నిపుణులు వీటిని వెలికి తీసి నిర్వీర్యం చేశారు. ఇలా ఎంతో మంది ప్రాణాలు పోకుండా కాపాడింది ఈ ఎలుక. మగావా సేవలను గుర్తించి బ్రిటన్కు చెందిన పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ యానిమల్స్ అనే వెటర్నరీ ఛారిటీ సంస్థ 2020లో బంగారు పతకం అందజేసింది. జంతువుల విభాగంలో శౌర్య పరాక్రమాలకు ఇచ్చే అత్యున్నత అవార్డు ఇది.

గతేడాదే రిటైర్డు
మగావా ఐదేళ్ల పాటు సేవలు అందించి గత ఏడాదే రిటైర్ అయ్యింది. రిటైర్మెంట్ పొందాక కాంబోడియా వాయవ్య ప్రావిన్సు సీఎం రీప్లో శేష జీవితం గడిపింది. అక్కడే కన్ను మూసింది. మానవ జాతికి ఎంతో సేవ చేసిన ఈ ఎలుకకు కాంబోడియా అధికారులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులు నివాళ్లర్పించారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!