Calvary Temple Hospital: సక‌ల సౌక‌ర్యాల‌తో క‌ల్వ‌రి టెంపుల్ ఆసుప‌త్రి యొక్క‌ విశేషాలు!

Calvary Temple Hospital క‌ల్వ‌రి టెంపుల్ అధినేత ప్ర‌ముఖ పాస్ట‌ర్ క‌ల్వ‌రి టెంపుల్ ఆసుప‌త్రిని గ‌తేడాది 2021 డిసెంబ‌ర్ 20న ప్రారంభించారు. ఈ ఆసుప‌త్రిని ఎమ్మెల్సీ క‌విత చేతుల మీదుగా ప్రారంభించారు. పేద‌ల‌కు త‌క్కుక ఖ‌ర్చుతోనే వైద్యం అందించాల‌నే సంక‌ల్పంతోనే క‌ల్వ‌రి టెంపుల్ ఆసుప‌త్రిని ప్రారంభించిన‌ట్టు పాస్ట‌ర్ డా.పి.స‌తీష్ కుమార్ తెలిపారు. అతి త‌క్కువ ఖ‌ర్చుతో ఆధునిక వైద్యం అందించ‌నున్న‌ట్టు తెలిపారు. కార్పొరేట్ ఆసుప‌త్రికి కామ‌న్ మెన్ వెళ్లేలా ఈ ఆసుప‌త్రి(Calvary Temple Hospital )ని ఏర్పాటు చేశామ‌న్నారు.

ఆసుప‌త్రి లోప‌ల బెడ్లు దృశ్యం

క‌ల్వ‌రి టెంపుల్ (Calvary Temple Hospital)ఆసుప‌త్రి సౌక‌ర్యాలు!

-పేద‌ల‌కు ప్రేమ‌తో వైద్యం అందించ‌డానికే ఈ ఆసుప‌త్రిని స్థాపించిన‌ట్టు పాస్ట‌ర్‌.డా.పి.స‌తీష్ కుమార్ తెలిపారు. ఈ ఆసుప‌త్రికి వ‌చ్చే పేషెంట్ల‌కు డాక్ట‌ర్ ఇచ్చిన డైట్ ప్ర‌కారం ఉచితంగా భోజ‌నం అందించే ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు.

-ఈ ఆసుప‌త్రిలో జన‌ర‌ల్ వార్డు అనేది అస‌లు ఉండ‌ద‌ట‌. ప్ర‌తి పేషెంట్‌కు త‌న బెడ్‌కు ఇరు వైపులా తెర‌లు ఏర్పాటు చేశామ‌ని వారి ప్రైవ‌సీకి అనుగుణంగా ఇది ఉంటుంద‌ని అన్నారు.

-కుల‌, మ‌త‌, ప్రాంతీయ బేధం లేకుండా అంద‌రికీ విలువైన వైద్యాన్ని అందించ‌నున్నామ‌ని పేర్కొంటున్నారు. ప్ర‌తి పేషెంట్ ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించ‌నున్నారు. అటెండ‌ర్‌కు కూడా బెడ్ సౌక‌ర్యం క‌ల‌దు.

-ప్ర‌తి ఒక్క పేషెంట్‌కు టాయిలెట్ కిట్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి బెడ్‌కు కూడా యుఎస్‌బి బోర్డు ఏర్పాటు చేశారు. దాని ద్వారా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు.

-పేషెంట్‌కు పేస్ట్‌, బ్రెష్‌, సోప్‌, బాడి లోష‌న్‌, వాట‌ర్ బాటిల్‌, షాంపూ, కోంబ్ ఉచితంగా అందించనున్నారు ఈ క‌ల్వ‌రి టెంపుల్ ఆసుప‌త్రిలో.

మాట్లాడుతున్న పాస్ట‌ర్ స‌తీష్ కుమార్‌, ప్ర‌క్క‌న ఎమ్మెల్సీ క‌విత‌

అనంత‌రం పి.స‌తీష్ కుమార్ మాట్లాడుతూ గ‌డిచిన కోవిడ్ కాలంలో తెలంగాణ‌లో కోవిడ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అంద‌రికి ఉచితంగా భోజ‌న స‌దుపాయం, వైద్య సౌక‌ర్యం క‌ల్పించామ‌న్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌రించినందుకు ధ‌న్య‌వాదాల‌ని తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ క‌విత కూడా త‌మ క‌ల్వ‌రి టెంపుల్ ప‌రంగా వారు చూపిస్తున్న ఆప్యాత‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాల‌ని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ క‌ల్వ‌రి టెంపుల్ ఆసుప‌త్రికి వ‌చ్చి నాణ్య‌మైన వైద్యాన్ని అందుకొని పూర్తి ఆరోగ్య వంతులుగా వెళ్ల వ‌చ్చ‌ని తెలిపారు.

Share link

Leave a Comment