calculating building materials | ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు! అన్నారు పెద్దలు. ఈ పరిస్థితుల్లో ఇల్లు నిర్మించడం అంటే సామాన్యుడు..ఇలా జీవిస్తే చాలులే ఈ రేట్లతో ఇల్లు కట్టుకుంటే అప్పుల పాలు అవ్వడమే తప్ప మరొకటి లేదని ఆలోచిస్తున్నాడు. ఒకప్పుడు ఇల్లు నిర్మించుకోవడం కోసం కాయ కష్టం చేసి ఒక లక్షో, రెండు, మూడు లక్షలో దాచుకునే వారు. వాటికి తోడు అత్తారింటి వారో, అన్నదమ్ములో సకేస్తే ఇల్లు నిర్మించుకుందా మనుకునే వారు ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు సాధారణ రెండు గదులు ఇల్లు నిర్మించాలంటేనే సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మినిమం ఖర్చు అవుతుంది. అసలే కరోనా వల్ల ఉపాధి కోల్పోయి అద్దెలతో బ్రతుకుతున్న కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఇక పోతే ఇల్లు నిర్మాణానికి ఈ ఏడాది 2022 మెటీరియల్ ఖర్చు ఎంత అవుతుందో చూద్దాం!
ఇంటికి కావాల్సిన మెటీరియల్ ధరలు
ఇసుక(Sand) ఒక ట్రాక్టర్ ట్రక్కు ధర రూ.5 వేలు తీసుకుంటున్నారు. ఆంధ్రాలోని అమరావతి ఇసుక టన్ను రూ.900 నుంచి రూ.1100 తీసుకుంటున్నారు. తెలంగాణలో సన్న ఇసుక టన్ను రూ.1200 తీసుకుం టున్నారు. లావుగా ఉండే ఇసుక టన్నుకు రూ.1250 తీసుకుంటున్నారు. సిమెంట్ ధర(cement cost)లు విషయానికొస్తే సిమెంట్ బ్యాగు ధర (భారతీయ సిమెంటు) రూ.390, ఆల్ట్రాటెక్ సిమెంట్ బ్యాగు ధర తెలంగాణలో రూ.385, రూ.390 ఉండగా, ఆంధ్రాలో రూ.400 ధర పలుకుతుంది. మహాశక్తి సిమెంట్ బ్యాగు ధర రూ.360, దాల్మియా సిమెంట్ ధర రూ.390, కేసీపీ సిమెంట్ ధర రూ.380 పలుకుతుంది.

ఇటుకలు ధర(brik cost) క్వాలీటీ వచ్చేవి ఒక్కొక్క ఇటుక రూ.8, రూ.9, రూ.10 పడుతుంది. సిమెంట్ ఇటుక వచ్చేది ఒక్కొక్కటి రూ.18.50 లేదా రూ.19 ధర పలుకుతుంది. వెయిట్ లెస్ సిమెంట్ ఇటుక ధర అడుగులను బట్టి రూ.40, రూ.43, రూ.44 రూ.60 రూ.90 ఒక్కటి ధర పలుకుతుంది. ఇక స్టీల్ ధర ఇల్లు నిర్మాణంలో అత్యంత ఎక్కువగా పలుకుతుంది. ప్రస్తుతం స్టీల్ ధర(steel cost) రూ.లక్ష పలుకుతుంది. వైజాగ్ స్టీల్ రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు ధర పలుకుతుంది. టాటా స్టీల్, జిందాల్ స్టీల్ రూ.95 వేలు నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతుంది. గోదావరి, తిరుపతి లాంటి స్టీల్ రూ.83 వేల వరకు ధర పలుకుతుంది. స్టీల్ ధరల్లో బార్ పెరిగేకొద్ది ధర తగ్గుతుంది. బార్ తగ్గేకొద్దీ ధర పెరుగుతుంది.
కాంక్రీట్‌కు కావాల్సిన కంకర్(kankara) రెండు రకాలుగా ఉంటుంది. 40 ఎంఎం, 20 ఎంఎం సైజులు ఉంటాయి. ఈ రెండు రేట్లు మొత్తంగా రూ.100 అటూ ఇటూ ఒకే విధంగా ఉంటాయి. ఒక యూనిట్ కంకర రేటు రూ.3500 నుంచి రూ.4000 పలుకుతుంది. కలప విషయానికి వస్తే టేకు లో కొన్ని రకాలు ఉన్నాయి. తక్కువ రకంలో చూసుకుంటే రూ.1400 నుంచి రూ.1500 అడుగు టేకు ధర పలుకుతుంది. టేకు క్వాలిటీని బట్టి రూ.6000 వరకు దర పలుకుతుంది. సిమెంట్ దర్వాజ వచ్చి ఒకటి రూ.1100 నుంచి రూ.1200 వరకు ధర ఉంది. సిమెంట్ కిటికీలు కూడా ఒక్కొక్కటి రూ.1200 ధర ఉంది. డబ్ల్యూపీసీ దర్వాజులు కొనాలంటే అడుగు వచ్చి రూ.160 నుంచి రూ.350 వరకు ధర పలుకుతుంది. ఇవి కూడా క్వాలిటీ, క్వానిటీని బట్టి ధర ఉంటుంది.

డోర్లు వచ్చేసి టేకు డోర్లు కొనాలంటే అడుగును బట్టి క్వాలిటీని బట్టి రూ.6000 ధర ఉంది, ఫ్లష్ డోర్స్ కొనాలంటే ఒక్కటి రూ.4000 ధర పలుకుతుంది. బాత్రూం డోర్స్ వచ్చేసి ఫ్లష్ డోర్స్ ధర రూ.2000 నుంచి రూ.5,000 వరకు ధర ఉంది. మార్బుల్స్(marble rate) వచ్చేసి స్వ్కేర్ మీటర్ రూ.100 వరకు ధర ఉంటుంది. ఇక రేకులు వేసుకొని ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు సిమెంట్ రేకులు మీటరు వచ్చి రూ.210 నుంచి రూ.250 వరకు ధర పలుకుతుంది. ఐరన్ రేకులు(iron sheet) అడుగు వచ్చి రూ.160 వరకు ధర పలుకుతుంది. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో ధర దాని క్వాలిటీని బట్టి ఉంటుంది. విండోస్ గ్లాస్ 40 ఎంఎం రూ.40 నుంచి రూ.45, 5 ఎంఎం ధర రూ.45 నుంచి రూ.50 వరకు ధర పలుకుతుంది. కొన్ని గ్లాసులు రూ.200 నుంచి రూ.500 వరకు ధర పలుకుతుంది. ఇక టైల్స్ రూ.35 నుంచి పార్కింగ్ టైల్స్ ధర(tiles price) ఉంది. సైజులు, క్వాలిటీని బట్టి ధర ఉంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!