Byreddy Siddhartha Reddy from Gudiwada | Byreddy Siddhartha news| గుడివాడ అంటేనే నాని..నాని అంటేనే గుడివాడ: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
Byreddy Siddhartha Reddy from Gudiwada | Byreddy Siddhartha news| గుడివాడ అంటేనే నాని..నాని అంటేనే గుడివాడ: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిGudiwada: కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైస్సార్సీపీ యువ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురువారం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి వచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గుడివాడలో జరుగుతున్న ఎండ్ల పందాల పోటీలను తిలకించేందుకు మంత్రి కొడాలి నాని ఆహ్వానం మేరకు వచ్చినట్టు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అని తనను సంక్రాంతి పండుగకు గుడివాడ పిలిచిన మంత్రి కొడాలి నాని అన్నకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత ప్రజాధరణ పొందిన వారిలో మంత్రి అనిల్ యాదవ్, మంత్రి కొడాలి నాని అన్న అని తెలిపారు. సంక్రాంతి పండుగకు ఎక్కువగా భీమవరం, కోన సీమ జిల్లాలకు వెళుతుంటామని, ఈ సారి గుడివాడలో ఎండ్ల పందాలు చూసేందుకు వచ్చామని అన్నారు.
రైతుల సంక్షేమమే
ప్రభుత్వ ధ్యేయం: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
రాష్ట్రంలో సిఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందన్నారు. రైతులకు మేలు చేసే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతులకు రుణాలు, పంట వేసుకునేందుకు రైతు భరోసా డబ్బులతో పాటు ఇన్సూరెన్స్ లాంటి సౌలభ్యాలను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. రైతుల కోసం వైస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక ఇరిగేషన్ పనులు పూర్తవుతున్నాయని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం ముందుందని అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు.
గుడివాడ అంటేనే నాని: బైరెడ్డి సిదార్థ రెడ్డి
గుడివాడ అంటేనే నాని, నాని అంటేనే గుడివాడ అని బైరెడ్డి సిదార్థ రెడ్డి అన్నారు. కొడాలి నాని అన్నకు రాష్ట్రంలో ప్రత్యేకమైన ప్రజాభిమానం ఉందని అని అన్నారు. గుడివాడ లో ఎడ్ల పందాలు నిర్వహించడం, తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎంతో మంది రైతులు ఒంగోలు గిత్తలను పోషించడానికి చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. కొడాలి నాని అన్న ఒంగోలు జాతి ఎద్దులను పెంచడం తనకు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఉన్న మక్కువను తెలుపుతుం దన్నారు. కొడాలి నాని అన్న ఒక్కసారి నందికొట్కూరు రావాలని కోరుతున్నట్టు తెలిపారు. తమ నియోజకవర్గానికి మంత్రి గా సహాయం చేయాలని కోరారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ పండుగ రైతుల పండుగ అని, ప్రతి ఒక్క రైతు క్షేమంగా ఉండాలని కోరారు.
ఇది చదవండి: స్టోరీ: సాగర్ ఉప ఎన్నిక పై గురి?