buying land propertyచాలా మంది స్థిరాస్తులు కొంటుంటారు. అయితే వాటిని కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే నా స్థలం, నా ఆస్థి అంటూ మూడో వ్యక్తి పేపర్లు పట్టుకుని ఆ స్థలం వద్దకు వస్తుంటాడు. ఇలాంటి సమస్యలు మనం నిత్యం వార్తల్లోనూ, బహిరంగ గానూ చూస్తూనే ఉంటాం. అందుకే కొనుగోలుకు ముందే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బంది(buying land property) ఉండదు.
ఆస్తి అమ్మే వ్యక్తికి ఆ అధికారం ఉందో లేదో పరిశీలించాలి. ఆస్తి ఆ వ్యక్తికి ఎలా సంక్రమించిందో తెలుసుకోవాలి. ఆ ఆస్తిపై ఇతరులెవరికీ ఎలాంటి హక్కులూ లేవని నిర్థారించుకోవాలి. ఆస్తిపై తనఖాలు కానీ, హామీలు కానీ..కోర్టు కేసులు కానీ ఉండకూడదు. ఆస్తిపై తనఖాలున్నాయో లేదో తెలుసుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి దానికి సంబంధింఇన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (encumbrance certificat)(ఈసీ) తీసుకోవాలి. అందులో పూర్తి సమాచారం ఉంటుంది.
అంతకు పూర్వం ఆ ఆస్తిని అమ్మేందుకు చేసుకున్న ఒప్పందాలపైనా ఆరా తీయాలి. చేసుకున్న ఒప్పందాలపైనా ఆరా తీయాలి. కొనుగోలు చేయబోయే ఆస్తి మైనర్ల పేరిట ఉండకూడదు. ఉంటే విక్రయానికి కోర్టు(Court) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆస్తికి సంబంధించిన పూర్వ దస్తావేజు(dastaaveju)లను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ప్రభుత్వం, మున్సిపాలిటీ, పంచాయతీ, విద్యుత్ శాఖకు ఆస్తిపై చెల్లించాల్సిన పన్ను బకాయిలు(tax due) ఉన్నాయేమో తెలుసుకోవాలి. స్థిరాస్తి సర్వే నెంబర్, ఇంటి నెంబర్, సరిహద్దులు, హద్దుల మధ్య విస్తీర్ణం, నీటి హక్కులు, వాన నీరు, మురుగు నీరు పోయే మార్గం తదితర విషయాలు దస్తావేజుల్లో స్పష్టంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
ఆస్తి కొనుగోలుకు ముందుగా ఇచ్చిన సొమ్ముకు రశీదు కానీ, సొమ్ము ఇచ్చినట్టు ధ్రువపత్రం కానీ పొందాలి. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజులు రాయడంలో అనుభవం ఉన్న వారితోనే వాటిని రాయించుకోవడం మంచిది. లేదా అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. సరైన స్టాంపస్ పేపరుపై మాత్రమే దస్తావేజులు రాయించి రిజిస్ట్రేషన్ (registration certificate)చేయించుకోవాలి. కొనుగోలు ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో క్రయం పూర్తి కాకపోతే తీసుకోవాల్సిన చర్యలను న్యాయవాదిని అడిగి తెలుసుకోవాలి.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?