business womenనేటి రోజుల్లో వ్యాపార రంగంలోకి మహిళలు ఎక్కువగానే ప్రవేశిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, తట్టుకుని విజయాన్ని అందుకుంటున్నారు. పచ్చళ్ల నుంచి స్మార్ట్ స్టార్టప్‌ల వరకు అన్నింటా తమదైన ముద్ర వేస్తున్నారు. కుట్లు, అల్లికలను కాలానికి తగ్గట్టుగా కొత్తగా పరిచయం చేస్తున్నారు. చిన్న మొత్తాలతో వ్యాపారం మొదలు పెట్టి పెద్ద మొత్తాలను సాధిస్తున్నారు. వీరి సక్సెస్ వెనుక ఈ సూత్రాలు కనిపిస్తాయని (business women)చెప్పవచ్చు.
ప్రారంభానికి ముందు..
చేయదలిచిన వ్యాపారం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. వ్యాపారం టార్గెట్, వినియోగదారులను దృష్టిలో పెట్టుకోవడం, వారి అభిరుచులు, ఆసక్తులు కూడా గమనించాలి. మార్కెట్‌ను అంచనా వేయడం. ఎక్కువ లాభానికి ఆశించకుండా కనీస లాభాలతో అనువైన ధరలతో మంచి నాణ్యమైన వస్తువులను అందించడం. కాలానికి అనుగుణంగా మార్పులను ఆహ్వానించాలి. సీజన్‌ను బట్టి వ్యాపారంలో కొత్త విధానాలను ప్రవేశ పెట్టగలగాలి. వాటికి సరైన ప్రచారం కల్పించగలగాలి. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను వినియోగదారులకు అందివ్వగలగాలి.
వ్యాపారంలో త్వరితగతిన అభివృద్ధి సాధించాలనే ఆరాటంతో పెట్టుబడి విషయంలో చాలా మంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవసరానికి మించి అప్పు చేయడం అనర్థానికి దారితీస్తుంది. డబ్బు విషయంలో కచ్చితంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అప్పు చేయకూడదు.


- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!