Business News India | శుక్రవారానికి సంబంధించిన బిజినెస్ తాజా వార్తలు కింద ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఆదానీ పవర్ స్టాక్ విలువ, ఇన్సూరెన్స్ కొత్త నిబంధనలు, రష్యాను వీడితున్న టాటా, ఇన్ఫోసిస్, నష్టాల్లో స్టాక్ మార్కెట్, క్రెడిట్ కార్డుల జారీపై ఆర్బిఐ కీలక ఆదేశాలు తదితర వార్తల(Business News India)ను కింద చదవండి.
రూ.లక్ష పెట్టుబడికి రూ.లక్ష లాభం: adani power
గత నెల రోజుల వ్యవధిలో ఆదానీ పవర్ కంపెనీ స్టాక్ విలువ రెండింతలైంది. నెల క్రితం ఈ సంస్థ షేర్ ధర రూ.125.50 వద్ద ఉండగా, ఇవాళ్టి ఇంట్రాడేలో షేర్ ధర రూ.259.20 ను తాకింది. అంటే మార్చి 25న రూ.లక్ష పెట్టి షేర్లు కొన్న వారు ఇప్పటి వరకు రూ.1.06 లక్షల లాభాన్ని పొందినట్టు, అటు మార్కెట్ విలువ పరంగా దేశంలోని తొలి 50 కంపెనీల జాబితాలోకి ఆదానీ పవర్ చేరింది.
పాటించకపోతే Insurance రాదు!
నిబంధనలకు మించి ప్రయాణికులు ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే, అప్పుడు బీమా రాదు. హెల్మెంట్ లేకుండా బైక్ నడిపినా బీమా లభించదు. రాంగ్రూట్లో వాహనాలు నడిపే వారికి బీమా దక్కదు. రాంగ్రూట్లో వెళ్లే వారి వల్ల ప్రమాదం జరిగితే జరిమానా విధిస్తారు. మద్యం తాగి వాహనాలు నడిపినా బీమా రాదు. సీటు బెల్టు ధరించకుండా వాహనం నడిపినా బీమా చెల్లించరు.
రష్యాకు గుడ్ బై చెప్పిన TaTa స్టీల్, infosys
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యాపై ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోనప్పటికీ, దేశంలో అతిపెద్ద కంపెనీలైన టాటా స్టీల్, ఇన్ఫోసిస్‌లు వారి కార్యకలాపాలను రష్యా నుండి బయటకు తరలించాలని నిర్ణయించుకున్నాయి. ఇన్ఫోసిస్ తమ నిర్ణయాన్ని ప్రకటన చేసిన వెంటనే టాటా స్టీల్ కూడా రష్యాతో బిజినెస్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
నష్టాల్లో stock market
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 515 పాయింట్లు కోల్పోయి 57,396 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 162 పాయింట్లు నష్టపోయి 17,229 వద్ద కొనసాగుతోంది. ఎస్బిఐ, డా.రెడ్డీస్, కొటాక్ బ్యాంకు, నెస్లే, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
lic ipo వాయిదా పడనుందా?
ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ఐపీఓ మారోసారి వాయిదా పడే అవకాశం ఉంది. ఇష్యూ జారీ చేసే సమయంపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మొదట మార్చిలోనే ఎల్ఐసి ని ఐపీఓకు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్దం కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇష్యూపై పడుతుందని భావించి వెనక్కి తగ్గింది. సెబీ అనుమతి ప్రకారం మే 12 వరకు ఐపీఓకు గడువు ఉంది. ఇప్పుడు కూడా వాయిదా పడితే ఆగస్టు-సెప్టెంబర్ జారీ చేసే అవకాశం ఉంది.
Credit cardల జారీపై ఆర్బిఐ కీలక ఆదేశాలు
కస్టమర్ల సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని బ్యాంకులు, కంపెనీలను ఆర్బిఐ ఆదేశించింది. దీన్ని ఉల్లంఘిస్తే కస్టమర్‌కు వేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా విధిస్తామని హెచ్చరించింది. బాకీల వసూలు కోసం సంస్థలు కస్టమర్లపై వేదింపులు, బెదిరింపులకు దిగరాదని స్పష్టం చేసింది. జూలై 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
మళ్లీ పెరిగిన GOLD ధరలు
నిన్న తగ్గిన బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.49,300 (రూ.150 పెరిగింది.) గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.53,780 (రూ.160 పెరిగింది.) గా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలోవెండి ధర రూ.73,000(రూ.300 తగ్గింది) గా ఉంది.
మారుతీ XL6 కొత్త వెర్షన్ రిలీజ్
మారుతీ సుజుకీ XL6లో కొత్త వెర్షన్ ను రిలీజ్ చేసింది. అప్డేట్ చేయబడిన డిజైన్, యాడ్ క్యాబిన్ ఫీచర్లు, 6-స్పీడు AT గేర్‌బాక్స్, ప్యాడిల్ షిప్టర్లతో కూడిన 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 75.8 కిలోవాట్ల గరిష్ట సామర్థ్యం దీని సొంతం. మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ విభాగాల్లో ఈ వెహికల్ లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. ధర రూ.11.29-14.55 లక్షలు (ఎక్స్‌షోరూం).
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!