business daily | ఈ రోజు ఇండియాలో బిజినెస్ న్యూస్ అపడేట్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇన్ఫోసిస్, స్టాక్ మార్కెట్, హోండా బైక్, హెచ్డి ఎఫ్‌సి బ్యాంకు షేర్ తదితర అంశాలపై బిజినెస్(business daily) వార్తలు మీకు అందిస్తున్నాము.
infosys: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఇన్ఫోసిస్
భారత్ లో టాప్-5 ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. తమ కంపెనీలో రిజైన్ చేసిన ఉద్యోగులు 6 నెలల పాటు టిసిఎస్, యాక్సెంచర్, ఐబిఎం, కాగ్నిజెంట్, విప్రో లాంటి పేరున్న కంపెనీల్లో పనిచేయరాదనే కొత్త నిబంధన తెచ్చింది. కొత్తగా జాయిన్ అయ్యే ఉద్యోగుల ఆఫర్ లెటర్లో కూడా ఈ రూల్ ఉంచింది. దీనిపై ఐటి ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిబంధన సమీక్షించాలని కేంద్రాన్ని కోరింది.
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 407 పాయింట్లు లాభపడి 56,870 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్సేంచీ నిఫ్టీ 126 పాయింట్లు వృద్ధి చెంది 17,085 వద్ద కొనసాగుతోంది. మారుతీ, రిలయన్స్, ఐటీసీ, హెచ్డిఎఫ్సీ, విప్రో, డా.రెడ్డీస్, ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
Covid ముందుకంటే పెరిగిన నియామకాలు
కోవిడ్ అవరోధాలు, సవాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని మాన్స్టర్ డాట్ కామ్ నివేదిక వెల్లడించింది. 2020 తో పోలీస్తే ఈ ఏడాది ఉద్యోగ నియామకాలు 6 శాతం పెరిగాయని తెలిపింది. పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్, టెలికాం రంగాల్లో పురోగతి, నియామకాలు పెరిగేందుకు దోహదం చేసిందని మాన్స్టర్ నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగాల్లో నియామకాలు 37% పెరిగినట్టు తేలింది.
కొత్త వెర్షన్ బైక్‌ను విడుదల చేసిన Honda
సూపర్ బైక్(super bike) గోల్డ్ వింగ్ టూర్లో కొత్త వెర్షన్‌ను భారత్‌లో విడుదల చే సింది హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. దీని ధర రూ.39.2 లక్షలు (ఎక్స్-షోరూం). డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, ఎయిర్ బ్యాగ్ దీని ప్రత్యేకత. 1,833 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 2022 గోల్డు వింగ్ టూర్ Japanలో తయారై ఇక్కడకు దిగుమతి అవుతుంది.
Biliti Electric: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఫ్యాక్టరీ తెలంగాణలో
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఫ్యాక్టరీని తెలంగాణలో స్థాపించేందుకు కాలిఫోర్నియాకు చెందిన బిలిటీ ఎలక్ట్రిక్ (Biliti Electric)కంపెనీ సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధి రాహుల్ గయాం ఈ విషయాన్ని వెల్లడించారు. ఏటా 2,40,000 ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 150 మిలియన్ డాలర్లతో పెట్టుబుడులు పెట్టబోతున్నట్టు పేర్కొన్నారు.
HDFC Bank Share: రూ.2.58 లక్షల కోట్ల ఆవిరి
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు(HDFC Bank), హెచ్‌డిఎఫ్‌సి విలీనం స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు రేపుతోంది. ఈ నెల 4న ఈ రెండు సంస్థలు విలీనం కాగా, తర్వాతి రోజు నుంచి ఆ కంపెనీల షేర్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం రూ.2.58 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇది బజాజ్ ఫిన్సెర్వ్ మార్కెట్ విలువ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ రోజు హెడ్‌డిఎఫ్‌సి బ్యాంకు షేరు రూ.60 నష్టపోయి రూ.1,335 వద్ద, హెచ్‌డిఎఫ్‌సి షేరు ధర రూ.123 తగ్గి రూ.2,140 వద్ద ముగిసింది.
Apple సంచలన నిర్ణయం
దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్-11 సిరీస్ తయారీని పూర్తిగా నిలిపివేస్తామని ప్రకటించింది. I PHONE-11, ఈ ఏడాది విడుదలైన ఐఫోన్ SE-3 ధరలు దాదాపు సమానంగా ఉండటంతో దశల వారీగా ఐఫోన్-11 సిరీస్ స్మార్ట్ ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సిద్ధమైంది. అటు ఐఫోన్-12 ధరలు తగ్గే ఛాన్సుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ – 14 సిరీస్‌ను యాపిల్ లాంచ్ చేయనుంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి