Bus Tempo Accident: తిరుపతి జిల్లా పాకాల మండలం నేండ్రగుంట ఈనాడు ఆఫీసు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక నుండి వస్తున్న ఆర్టీసీ Bus ను తమిళనాడుకు చెందిన Tempo వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..


పాకాల సిఐ రాజశేఖర్ ఎస్సై రామకృష్ణ విషయం తెలుసుకుని తమ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి ఆర్తనాదాలతో అక్కడ వాతావరణం మారుమ్రోగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Bus Tempo Accident: ప్రమాద దృశ్యాలు







