Bullet Bike

Bullet Bike: ఒక బుల్లెట్ 13 ద్విచ‌క్ర వాహ‌నాల‌ను ప‌ట్టించింది..ఎలా అంటే?

Spread the love

Bullet Bike క‌డియం: ఖ‌రీదైన మోటారు సైకిళ్ల‌ను సునాయాసంగా మాయం చేసే దొంగ‌లు పెరిగిపోతున్న రోజులివి. అటువంటి దొంగ‌ల‌ను ప‌ట్టుకోవ‌డం పోలీసుల‌కు పెద్ద స‌వాల్‌గా మారుతోంద‌ని చెప్ప‌వ‌చ్చ. అయితే ఓ Bullet Bike (బుల్లెట్ బండి) ఏకంగా 13 మోటారు సైకిళ్లును ప‌ట్టించిన సంఘ‌ట‌న తూర్పుగోదావ‌రి జిల్లా క‌డియం మండ‌లంలోని చ‌ర్చనీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే క‌డియపులంక‌కు చెందిన ప్ర‌ముఖ శ్రీ‌విజ‌య‌దుర్గ న‌ర్స‌రీ రైతు రావిపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ముచ్చ‌ట‌ప‌డి సుమారు రెండు ల‌క్ష‌ల రూపాల‌య‌తో బుల్లెట్ ను కొనుగోలు(Bullet Bike) చేశారు.

ఇంటి ఎదుట పార్క్ చేసిన ఆ బుల్లెట్ చోరీకి గురైంది. ఉద‌యం బుల్లెట్ పోయింద‌ని అంద‌రూ కంగారు ప‌డుతుంటే వెంక‌టేశ్వ‌ర‌రావు ఏమాత్రం కంగారు ప‌డ‌లేదు. వెంట‌నే సెల్ ఫోన్లో నెట్ ఆన్ చేసి చెక్ చేశారు. ఎందుకంటే ఆయ‌న త‌న న‌ర్స‌రీ కార్లుతో పాటు ఈ బుల్లెట్ కు కూడా జిపిఎస్ global positioning system (GPS) ఏర్పాటు చేశారు. దాని ప్ర‌కారం చూస్తే ఆ బుల్లెట్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెల్టాన్ హోటల్(Shelton Hotel) స‌మీపంలో ఒక ఇంటి వ‌ద్ద ఉంద‌ని గుర్తించారు. అయితే అప్ప‌టికే Number Plate కూడా మార్చేశారు. మ‌రికొద్ది స‌మ‌యం ఉంటే ఆ బుల్లెట్ రూపురేఖ‌లే మార్చేసే మాయ‌గాళ్లు వాళ్లు.

ఈ దొంగ‌త‌నం విష‌యాన్ని క‌డియం సిఐ రాంబాబు దృష్టికి తీసుకెళ్ల‌గా ఆయ‌న కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. ఈ కేసులో ప‌ట్టుబ‌డ్డ ముగ్గురు దొంగ‌ల‌ను విచారించ‌గా 13 ద్విచ‌క్ర వాహ‌నాలు వారి వ‌ద్ద దొరికాయి. ఇవ‌న్నీ క‌డియపులంక ప్రాంతంలో దొంగిలించిన‌వే. అయితే సెల్ నెట్ ఆఫ్ చేయ‌కుండా ఉంటే ఆ మోటార్ సైకిల్ స్టార్ట్ చేసినా వెంట‌నే సైరన్ మోగుతుంద‌ని రావిపాటి తెలిపారు. ఏదేమైన‌ప్ప‌టికీ కేవ‌లం 12 వేల రూపాయాల‌తో ఏర్పాటు చేసిన ఈ జిపిఎస్ సిస్టం దొంగ‌ల‌ను ప‌ట్టించ‌డంతో బుల్లెట్ య‌జ‌మానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు ఆ ప్రాంతం వాసులు.

The baby: అట్ట‌పెట్టెలో చిన్నారిని వ‌దిలివెళ్లిన వైనం | కాపాడిన కాటికాప‌రి!

The baby: రాజ‌మండ్రి: తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అట్ట‌పెట్టెలో తీసుకొచ్చిన శిశువును శ్మ‌శానంలో వ‌దిలేసి వెళ్లిపోయారు. కొన ఊపిరితో Read more

Nitrogen gas smoke: ముఖానికి క‌వ‌ర్‌తో నైట్రోజ‌న్ గ్యాస్ పీల్చి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

Nitrogen gas smoke: Hyderabad: నైట్రోజ‌న్ గ్యాస్ పీల్చుకుని ఓ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద సంఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు క‌థ‌నం ప్ర‌కారం..తూర్పు Read more

Love on wife: భార్య‌పై ప్రేమ‌..నిలువెత్తు విగ్రహం ప్ర‌తిష్ట‌త

Love on wife: kakinada: భార్య‌పై ఉన్న ప్రేమతో ఆమె విగ్ర‌హం త‌యారు చేయించిన సంఘ‌ట‌న తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను విడిచి వెళ్లిన Read more

East Godavari News: Car accident in Jaggampet | క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతి

East Godavari News: Car accident in Jaggampet | క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతిJaggampeta: తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు Read more

Leave a Comment

Your email address will not be published.