Bulla Vijay Kumar | రానున్న ఎన్నికల కోసం ఏపీలో రాజకీయాలు ఇప్పుడే ముందు చూపుతో వేగం పెంచాయి. ఎక్కడ గెలుస్తాము..ఎక్కడ ఓడిపోతాం..గత ఎన్నికల్లో ఎక్కడ దెబ్బతిన్నాం..ఏ సామాజిక వర్గం నుండి ఆశించిన ఓట్ల ఫలితం రాలేదు..ఏ నాయకుడు సరైన వాడు..ప్రజలు ఎవరి వైపు చూస్తున్నారనే ఆలోచనలకు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ టిడిపి(TDP), జనసేన, బీజేపీ వ్యూహ రచనతో పదును పెడుతున్నాయట. ఎట్టి పరిస్థితుల్లో రానున్నఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని ఆశ పడుతున్నాయట. ఇందులో భాగంగా విజయవాడ రాజకీయాల్లో టిడిపి కొత్త వ్యూహంకు శ్రీకారం చుట్టిందా?
Bulla Vijay Kumar | టిడిపి టార్గెట్ బుల్లా విజయ్
విజయవాడలోని లక్షా 70 వేల మంది దళితుల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందని తెలుస్తోంది. విజయవాడలోని దళిత సామాజిక వర్గానికి సరియైన రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదని, ఒక వేళ పదవులు ఇచ్చినా అవి కేవలం అలంకార ప్రాయంగా ఉన్న పదవులు మాత్రమే తప్ప దళితులకు ఒరిగిందేమీ లేదని అభిప్రాయం దళితుల్లో బలంగా ఉందనే మాట వినిపిస్తుందట. విజయవాడలోని దళితులు అసంతృప్తితో ఉన్నారని వారిని ఆకట్టుకునేందుకుఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు టిడిపి అధిష్టానం పావులు కదుపుతున్నారని విశ్వసనీయ సమాచారం.
ఈ అసంతృప్తిని పసిగట్టిన టిడిపి అధిష్టానం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంల పొలిటికల్ రాజధాని అయిన విజయవాడలోని రెండు అసెంబ్లీ స్థానాలను తృటిలో చేజార్చుకున్నామని నైరాశ్యంలో ఉన్న టిడిపి నాయకత్వం తిరిగి కైవసం చేసుకనే దిశగా ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 1983 లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు విజయవాడలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బి.ఎస్.జయరాజ్ కు సీటు ఇచ్చి విజయవాడలోని దళితులను తమ వైపు తిప్పుకున్న విషయం తెలిసిందే.


వివాద రహితుడు బుల్లా(Bulla)
ఆయన అనుసరించిన వ్యూహాన్ని మరల విజయవాడలో అమలు చేయడానికి పావులు కదుపుతున్నట్టు సమాచారం.విజయవాడలో బలమైన ఎస్సీ నేత కోసం వెతికే క్రమంలో సీనియర్ మోస్ట్ నాయకుడు వివాద రహితుడుగా పేరున్న బుల్లా విజయ్ కుమార్ ను టిడిపిలో తీసుకునేందుకు అధిష్టానం పావులు కదుపుతుందని విశ్వసనీయ సమాచారం. విజయవాడలో ఎస్సీ నేత అన్వేషణలో బలమైన అభ్యర్థి కోసం పలు అంశాలను పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. పార్టీ పట్ల విధేయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం కొసమెరుపు.
విజయవాడలో ఎస్సీ సామాజిక వర్గానికే కాక అన్ని సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కలిగిన బుల్లా విజయకుమార్‌ను ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని భావిస్తున్నట్టు భోగట్టా. గత కౌన్సిల్లో టిడిపితో ఢీ అంటే ఢీ అనే విధంగా పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టిన విషయం కూడా నారా వారి దృష్టికి వెళ్లిన్నట్టు తెలిసింది. గత కౌన్సిల్లో 50వ డివిజన్ నుండి పోటీ చేసి గెలిచి ఈ సారి 49వ డివిజన్‌కు మారినా విజయాన్ని అందుకోవడంతో బుల్లా విజయ్ కుమార్ నగరంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందని నిరూపించడమే కాకుండా పార్టీకి కట్టుబడి చెప్పిన పని చేసుకొని వెళతాడనే మంచి గుర్తింపు, పేరు కూడా ఉంది.
ఇక బుల్లా విజయ్ కుమార్ ను చేర్చుకొని అసెంబ్లీకి పంపాలని, నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. అందుకు అవసరమయ్యే నిధులను కూడా పార్టీయే సమకూర్చాలని ఆలోచనతో అధిష్టానం ఉంది. ఏదిఏమైనా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. 1983వ సంవత్సరంలో అన్న ఎన్టీఆర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెంది. బి.ఎస్.జయరాజ్‌కు సీటు ఇచ్చి ఎస్సీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకున్నట్లే ఇప్పుడు అదే ఫార్మూలా పని చేస్తుందేమో చూద్ధాం అని అంటున్నారు టిడిపి సీనియర్ నాయకులు.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్