Bulk Email Marketing | చాలా మంది ఈమెయిల్ మార్కెటింగ్‌పై ఆసక్తి చూపరు. కానీ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో సేల్స్ జరగాలన్నా, ప్రాఫిట్ పొందాలన్నా ఈమెయిల్ మార్కెటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ-కామర్స్, సేల్స్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేస్తున్నారంటే మీకు ఈమెయిల్ మార్కెటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. సాధారణంగా చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్కువుగా సోషల్ మీడియా మార్కెటింగ్‌పైనే ఎక్కువుగా ఆధారపడుతుంటారు. ఈమెయిల్ మార్కెటింగ్ వైపు వెళ్లరు. కారణం ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలనే అవగాహన లేకపోవడం, ఈమెయిల్స్ ఎవరు ఓపెన్ చేస్తారులే అనే అపోహ మాత్రం ఉందని చెప్పవచ్చు.
ఈమెయిల్ మార్కెటింగ్‌తోనే లాభం!
ప్రస్తుతం ఉన్న డిజిటల్ మార్కెటింగ్ రంగంలో వస్తువు సేల్స్ చేసే క్రమంలో ఎక్కువ లాభం అందించేది ఈమెయిల్ మార్కెటింగే నంట. ఎందుకంటే ఈమెయిల్ ద్వారా మనం కస్టమర్‌ను రీచ్ అయినప్పుడు తాను 1 టు 1 కమ్యునికేషన్గా ఫాలో అవుతారు. అంటే మనం ఒక కంపెనీగా గానీ, బ్లాగర్‌గా గానీ డైరెక్టుగా వారితో మాట్లాడినట్టు ఫీలవుతారు.ఈ టిప్స్ మిగిలిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం మీద సరిగా పనిచేయవు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్టును అప్లోడ్ చేయాలంటే అందర్నీ ఉద్దేశించి పోస్టు చేయాలి తప్ప ఒక ప్రత్యేక మైన వ్యక్తిని టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టలేము. అదే ఈమెయిల్ ద్వారా అయితే ఒక వ్యక్తిని పర్సనల్‌గా సెలెక్ట్ చేసుకొని అతనికి మన ప్రొడక్ట్ కంటెంట్ గురించి ప్రత్యేకంగా పేరును సంబోధిస్తూ వారి మెయిల్ చేయవచ్చు.
బల్క్ ఈమెయిల్ తో లాభం ఉందా?
దానివల్ల అవతల వ్యక్తి మన ప్రొడక్ట్ గురించి ఆలోచించే అవకాశం ఉంది. మనల్ని నేరుగా సంప్రదించే అవకాశం కూడా ఎక్కువ శాతం ఉంటుంది. దీని వల్ల కంపెనీ దారుడుకు, కొనుగోలుదారుడకు మధ్య నమ్మకం అనేది ఏర్పడుతుంది. జనరల్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ అంటే చాలా మంది బల్క్ ఈమెయిల్స్(Bulk Email Marketing)ను కొనుగోలు చేస్తారు. అలా బల్క్ ఈమెయిల్స్ కొని ఒకేసారి ఈమెయిల్స్ అన్నీ సెండ్ చేస్తారు. ఇలాంటి విధానాన్ని కోల్డ్ ఈమెయిల్ అంటారు. అయితే ఈ బల్క్ ఈమెయిల్స్ విధానం అనేది చాలా వరకూ వర్క్ అవుట్ అవ్వదు. చాలా మంది ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఇదే ప్రొసెసర్ అనుకుంటారు. కానీ ఇది తప్పు.
అయితే బల్క్ ఈమెయిల్స్ విధానం అనేది చాలా వరకు కాకపోయిన 100 కు 29 శాతం మాత్రమే వర్క్ అవుట్ అవుతాయి. బల్క్ ఈమెయిల్స్‌లో 1000 మందికి ప్రొడక్ట్ గురించి ఈమెయిల్స్ సెండ్ చేస్తే అందులో 5 గురు మాత్రమే రెస్పాండ్ అవుతారు. మన ప్రొడక్ట్ గురించి ఆరా తీసి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కస్టమర్లు ఎవరైతే ఉంటారో వారు టార్గెట్ యూజర్లు కాదు.కాబట్టి వారికి బల్క్ ఈమెయిల్స్ పంపినా వారు కొనుగోలు చేస్తారని నమ్మకం లేదు. మార్కెట్లో మాత్రం ఈ బల్క్ ఈమెయిల్స్ డేటాబేస్ అమ్ముకునే వారు మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుందని మాయచేసి మనకు సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతుంటారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!