BTech Student Murdered

BTech Student Murdered: బైక్ ఎక్క‌నందుకే పొడిచి చంపాడా? న‌డిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని హ‌త్య‌!

Spread the love

BTech Student Murdered: గుంటూరు: న‌గ‌రంలోని బీటెక్ విద్యార్థిని ర‌మ్య దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. కాకాని రోడ్డులోని ప‌రామ‌య‌కుంట వ‌ద్ద ఓ యువ‌కుడు ర‌మ్య‌పై క‌త్తితో దాడి చేసి పారిపోయాడు. బాధిత యువ‌త పేరు న‌ల్ల‌పు ర‌మ్య‌. ఓ కాలేజీలో బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. ఆదివారం ఉద‌యం ప‌రామ‌య‌కుంట నుంచి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా ఓ సైకో యువ‌కుడు ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చి బైక్ ఎక్కాల‌ని కోరాడు. అందుకు ఆమె నిరాక‌రిచింది. దీంతో అత‌ని వెంట తెచ్చుకున్న క‌త్తితో ర‌మ్య క‌డుపులో మెడ‌పై ఆరు సార్లు పొడిచాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో ర‌మ్య అక్క‌డిక్క‌డే మృతి చెందింది.BTech Student Murdered

జీజీహెచ్‌లో ర‌మ్య మృత‌దేహాన్ని గుంటూరు అర్బ‌న్ ఎస్పీ ఆరీఫ్ హ‌ఫీజ్ ప‌రిశీలించారు. నిందితున్ని త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌న్నారు. దారుణానికి పాల్ప‌డ్డ యువ‌కునికి, ర‌మ్య‌కు ఏమైనా ప‌రిచ‌యాలు న్నాయా అనే కోణంలో విచార‌ణ జ‌రుగుతోంది. ర‌మ్య‌కు ఎవ‌రితో సంబంధాలు లేవ‌ని స్నేహితులు తెలిపారు. దీంతో ర‌మ్య ఫోన్ ఇప్పుడు కీల‌కంగా మారింది. ఆమె ఫోన్ లాక్ ఓపెన్ అయితే కీల‌క విష‌యాలు తెలిసే అవ‌కాశం ఉంది. ర‌మ్య అక్క మౌనిక దాడి జ‌రిగిన‌ప్పుడు ప‌క్క‌నే ఉంది. దీంతో పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు.

సీఎం ఆరా .. బాధిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ప్ర‌క‌ట‌న‌

గుంటూరులో యువ‌తి ర‌మ్య హ‌త్యా ఘ‌ట‌న‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దిశ కింద వేగంగా చ‌ర్య‌ల‌ను తీసుకుని దోషికి క‌ఠిన శిక్ష ప‌డేలా చేయాల‌న్నారు. ఘ‌ట‌న వివ‌రాలు తెలియ‌గానే హోంమంత్రి ఆస్ప‌త్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఆ కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని భ‌రోసా ఇచ్చిన విష‌యాన్ని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప‌రిహారంగా రూ.10 ల‌క్ష‌లు ఆ కుటుంబానికి ఇవ్వాల‌ని సీఎం ఆదేశించారు.

బిటెక్ విద్యార్థిని హ‌త్య సీసీ దృశ్యాలు

Kurnool News: కర్నూల్ జిల్లాలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం

Kurnool News: క‌ర్నూల్ జిల్లా కౌతాళం మండ‌ల ప‌రిధిలోని కామవ‌రం గ్రామంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఓ భూవివాదంలో వైసీపీ, బిజేపీ వ‌ర్గీయులు ప‌ర‌స్ప‌రం దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. Read more

Thota Chandraiah Murder: ఏక‌ద‌శి రోజున‌ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ర‌క్తంతో ఎగిసిప‌డ్డ వేట‌కొడ‌వ‌ళ్లు!

Thota Chandraiah Murder: మాచ‌ర్ల: పండుగ వేళ ఏపీలో రాజ‌కీయ హ‌త్య చోటు చేసుకోవ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి నేత Read more

teacher murderd: క‌దిరిలో బ‌రితెగించిన దొంగ‌లు..ఉపాధ్యాయురాలు హ‌త్య‌

teacher murderd: అనంత‌పురం: క‌దిరిలో దొంగ‌ల బీభ‌త్సం అక్క‌డ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి ఓ ఉపాధ్యాయురాల‌ని చంపారు దుండ‌గులు. క‌దిరి ప‌ట్ట‌ణంలోని మంగ‌ళ‌వారం Read more

Engineering Student Murdered:ఎట్ట‌కేల‌కు నిందితుడు దొరికాడు..పోలీసుల‌ను చూసి బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మ‌హ‌త్య‌య‌త్నంకు ప్ర‌య‌త్నం!

Engineering Student Murdered:గుంటూరులో బి.టెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో నిందితున్ని అరెస్టు చేసిన‌ట్టు డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ అన్నారు. హ‌త్య జ‌రిగిన 24 గంట‌ల్లోపే గుంటూరు Read more

Leave a Comment

Your email address will not be published.