BS Yediyurappa: రెండ్రోజుల కిందట కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం నమోదు చేశారు. అయితే ప్రస్తుతం యడియూరప్ప తదుపరి కార్యచరణపై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఆంధప్రదేశ్ గవర్నర్గా యడియూరప్ప ఏపీలో అడుగు పెట్టనున్నారనే ఊహగానాలు మొదలయ్యాయి.
BS Yediyurappa: అమరావతి: యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయకముందు నుంచే ఏపీకీ గవర్నర్గా రానున్నాడని వార్తలు వెలువడ్డాయి. తన రాజీనామా అంశాన్ని ఖండిస్తూనే వచ్చిన యడియూరప్ప చివరకు రాజీనామా చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను గవర్నర్ కోరారు.
ఇక యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో యడియూరప్పకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఆశచూపినట్టు కూడా ప్రచారం సాగుతోంది. ఏపీ రాష్ట్రానికి గవర్నర్గా యడియూరప్పను నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏపీలో బీజేపీ పార్టీ రాజకీయాలపై కేంద్రం ఫోకస్ చేసింది. చాలా కాలంగా ఏపీలో బలబడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.