land issu

land issu: త‌మ్ముడు వేధిస్తున్నాడు సారూ..పెట్రోల్ బాటిల్‌తో పోలీస్‌స్టేష‌న్‌కు అక్కాచెల్లెళ్లు

Spread the love

land issu: వికారాబాద్: ఆ ఇంటి ఆడ‌ప‌డుచుల‌కు తండ్రి స్థానంలో నిలిచి అండ‌గా ఉండాల్సిన సోద‌రుడే వాళ్ల పాలిట య‌ము డుగా త‌యార‌య్యాడు. ఆస్తి కోసం నిత్యం వారిని బూతులు తిడుతూ దాడికి పాల్ప‌డ‌ట‌మే కాకుండా చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌డంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో అక్కా చెల్లెళ్లు త‌మ్ముడు చేతిలో చ‌నిపోయే కంటే పోలీస్ స్టేష‌న్ ముందు చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరు మండ‌లం కొత్ల‌పూర్ గ్రామానికి చెందిన సురేష్ గౌడ్‌, రేణుక‌, జ‌గ్గ‌మ్మ ముగ్గురు ఒకే సంతానం. రేణుక‌ను గ‌తంలో ఓ పోలీస్ అధికారి పెళ్లి చేసుకొని మోసం చేయ‌డంతో అత‌నితో దూరంగా ఉంటుంది.

ఆస్తి(land issu) విష‌య‌మై జ‌గ్గ‌మ్మ‌, రేణుక ఇద్ద‌రు క‌లిసి త‌మ్ముడు సురేష్ గౌడ్‌ని ప్ర‌శ్నించ‌గా కోపంతో ఊగిపోయిన సురేష్ గౌడ్ అక్క‌ల ఇద్ద‌రిని బూతులు తిడుతూ నానా చిత్ర‌హింస‌ల‌కు గురిచేయ‌డం మొద‌లు పెట్టాడు. గ‌తంలో కూడా ఈ విధంగా దాడి చేసి కొట్ట‌డంతో అత‌నిపై పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు పోలీసులు.

కేసు న‌మోదు అయిన‌ప్ప‌టికీ సురేష్ అక్క‌ల‌పై దాడికి పాల్ప‌డుతూనే ఉన్నాడ‌ని చంపుతాన‌ని బెదిరింపుల‌కు కూడా దిగ‌డం జ‌రిగింద‌ని ఈ క్ర‌మంలో తాము చేసేది ఏమీ లేక త‌మ్ముడు చేతిలో చ‌నిపోయే దానికంటే పోలీస్‌స్టేష‌న్ ముందు చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పెట్రోల్ బాటిల్ తో క‌రణ్ కోర్టు పోలీస్ స్టేష‌న్ ముందు హ‌ల్ చ‌ల్ చేశారు.

ఈ విష‌యం గ‌మ‌నించిన పోలీస్ స్టేష‌న్ సిబ్బంది అక్క‌డికి చేరుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టానికి సిద్ధ‌మైన వారిని స‌ముదాయించి నిందితుడు సురేష్ గౌడ్‌పై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య తీసుకుంటామ‌ని హామీ ఇవ్వ‌డంతో రేణుక‌,జ‌గ్గ‌మ్మ వెనుదిగారు.

Harassment: భ‌ర్త‌కు దూరంగా ఉంటున్న భార్య‌పై క‌న్నేసిన పోకిరీలు..చివ‌రికి?

విషాదంగా ముగిసిన వివాహిత క‌థ‌! Harassment: Hyderabad: భ‌ర్త వేధింప‌లు భ‌రించ‌లేక విడిపోయి దూరంగా ఉంటుందోది ఓ వివాహిత‌. అయిన‌ప్ప‌టికీ ఆ మ‌హిళ‌కు ప్ర‌శాంత‌త దొర‌క‌లేదు. ఒంటరిగా Read more

Jubilee Hills: భ‌వ‌నంపై నుంచి ప‌సిపాప‌తో దూకి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

Jubilee Hills: భ‌వ‌నంపై నుంచి ప‌సిపాప‌తో దూకి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌ Hyderabad: హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. 8 నెల‌ల పాప‌తో క‌లిసి ఓ Read more

Road accident: మృత్యురూపంలో కారుపై దూస‌కొచ్చిన లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Road accident: వికారాబాద్ జిల్లాలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మ‌రొక‌రి ప‌రిస్థితి Read more

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. Read more

Leave a Comment

Your email address will not be published.