Brother in law who attacked with a knife: బామ్మర్ధి పై క‌త్తితో దాడి చేసిన బావ

Brother in law who attacked with a knife:బామ్మ‌ర్థిపై బావ క‌త్తితో దాడి చేసిన సంఘ‌ట‌న‌ చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లో వెళితే..
త‌మిళ‌నాడు రాష్ట్రం పెర్నంబుట్‌కు చెందిన శాంత‌(33)కు 12 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా శాంతిపురం మండ‌లం నార‌సింహేప‌ల్లికి చెందిన నారాయ‌ణ స్వామితో వివాహ‌మైంది. నారాయ‌ణ స్వామి బెంగుళూరులో బెయింట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇటీవ‌ల క‌రోనా ప్ర‌భావంతో లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురు కుమారులు దండికుప్పం ప్ర‌భుత్వ హాస్ట‌ల్ లో ఉంటు చ‌దువుకుం టున్నారు. కాగా, గ‌త కొంత కాలంగా భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు కార‌ణంగా శాంతి నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే, హాస్ట‌ల్ లో ఉంటూ చ‌దువుకుంటున్న కొడుకుల‌ను చూసేందుకు త‌న అన్న దినేష్‌, వ‌దిన దుర్గ‌తో క‌లిసి హాస్ట‌ల్ వ‌ద్ద‌కు రాగా విష‌యం తెలుసుకున్న బావ నారాయ‌ణ స్వామి హాస్ట‌ల్ వ‌ద్ద‌కు చేరుకున్నాడు. భార్య‌తో వాద‌న‌కు దిగాడు. ఈ క్ర‌మంలో న‌డిరోడ్డుపై భార్య‌తో గొడ‌వ‌ప‌డ‌గా అడ్డొచ్చిన బామ్మ‌ర్థి దినేష్‌పై క‌త్తితో దాడి చేశాడు. గాయ‌ప‌డ్డ దినేష్ ను చికిత్స నిమిత్తం కుప్పం పీఇఎస్ ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. అయితే గాయ‌ప‌డ్డ దినేష్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ పోలీసుల‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఇప్ప‌టికైనా త‌న‌కు న్యాయం చేయాల‌ని బాధితుడు వేడుకుంటున్నాడు.

ఇది చ‌ద‌వండి:ఎస్సైల‌నే బెదిరించిన కిలాడీ లేడి..చివ‌ర‌కు!

ఇది చ‌ద‌వండి:కొత్త పార్టీపై ష‌ర్మిల బిజీ! ఖ‌మ్మం నేత‌ల‌పై ఫోక‌స్‌!

ఇది చ‌ద‌వండి: ఆ చేప మ‌హా డేంజ‌ర్‌! త‌గిలితే అంతే సంగ‌తులు!

ఇది చ‌ద‌వండి: అన్న‌పై ఎంత అభిమాన‌మో!

ఇది చ‌ద‌వండి: విషాదం: యువ జంట ఆత్మ‌హ‌త్యాయత్నం‌‌..యువ‌కుడు మృతి!

ఇది చ‌ద‌వండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!

ఇది చ‌ద‌వండి:అట‌వీ శాఖ‌కు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జ‌రిమానా!

చ‌ద‌వండి :  Aarogyasri ప‌రిధిలో 50 శాతం బెడ్లు అందుబాటులో...Minister Vellampalli Srinivasa Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *