Brother Anil Kumar | ఏపీలో వైఎస్.షర్మిల భర్త, మత బోధకులు బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ పెడుతున్నట్టు వస్తున్న ప్రచారాలని ఆయన ఖండించారు. ఇప్పటి వరకు అయితే అటువంటి ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెడతాననే అంశం కేవలం ఊహగానాలేనని చెప్పు కొచ్చారు. రాజకీయంగా ఏదైనా ఉంటే తాను ముందుగా మీడియాకు వివరిస్తానని(Brother Anil Kumar) అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి బావమరిది, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ వార్తలు ఇప్పుడు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యాయి. తెర వెనుక ఏం జరుగుతుందో మీడియా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భావం అనేది ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే బ్రదర్ అనిల్‌తో వైసీపీ పార్టీ వ్యతిరేక వర్గాలు మంతనాలు జరిపినట్టు సమాచారం.
బీసీ నేతలతో సమావేశం
బ్రదర్ అనిల్ కుమార్ బీసీ నేతలతో సమావేశం ముగిసిందని తెలుస్తోంది. కాసేపట్లో మీడియా ఎదుటకు బ్రదర్ అనిల్ వచ్చి మాట్లాడనున్నారు. అయితే సమావేశంలో ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని బీసీ నేతలు అనిల్ కుమార్‌ను కోరినట్టు సమాచారం. అవసరమైతే జాతీయ పార్టీ ప్రారంభించాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్రదర్ అనిల్ కుమార్ చెప్పారని తామంతా వైసీపీ పార్టీకి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించామని అంటున్నారు. ఇప్పుడు సీఎం జగన్ పట్టించుకోవడం లేదని బీసీ నేతలు అనిల్ ఎదుట ఆవేదనకు గురయ్యారని తెలుస్తోంది. కాబట్టి ఏపీలో కొత్త పార్టీ పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!