Brother Anil Kumar New Party | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతందనే ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బావ, షర్మిలా భర్త ప్రముఖ అంతర్జాతీయ క్రిస్టియన్ మత బోధకులు బ్రదర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఆవిష్కరణ అయ్యే అవకాశం ఉందని మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్ఛనీయాంశంకు దారి తీస్తోంది. బ్రదర్ అనిల్ కుమార్(Brother Anil Kumar New Party) పేరు బయటకు రావడంతో వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హోటళ్లో క్రిస్టియన్, మైనార్టీ సంఘాల నేతలతో బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడినట్టు మీడియాలో వస్తుంది. ఇప్పటికే వైఎస్.షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టి అక్కడ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సమయంలో బ్రదర్ అనిల్ కుమార్ ఉండవల్లి అరుణ కుమార్ను కలవడం, పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో సమావేశం లో కొత్త పార్టీ గురించి ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది.
వైఎస్.షర్మిల ఇప్పటికే తెలంగాణలో పార్టీ పెట్టవద్దని తన అన్న వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కీలక నాయకుడుని స్వయంగా చెప్పి పంపించినప్పటికీ షర్మిల ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టి పాదయాత్రలు, మీటింగ్లు ఎరైంజ్ చేస్తున్నారు. అయితే వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు బ్రదర్ అనిల్ తరపున కొందరు మత ప్రబోదకులు, ఇతర సంఘాల నాయకులు ఓట్లు వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన జగన్ పట్టించుకోవడం లేదని, తమకు అపాయిట్మెంట్ ఇవ్వడంలేదని వారు బ్రదర్ అనిల్ వద్ద చర్చించినట్టు తెలుస్తోంది.
కొత్త పార్టీ విషయమై బ్రదర్ అనిల్ కుమార్ను మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని, కొత్త పార్టీ పెట్టడం లేదని చెప్పినట్టు సమాచారం. అయినప్పటికీ ఇతర సంఘాల నేతలు మాత్రం కొత్త పార్టీ రాబోతుందని మూహూర్తం కూడా ఖరారు అయినట్టు డిబెట్లలో చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలో ఉన్న పార్టీలో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఢీకొంటూ పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో
రాజకీయంగా ఇబ్బందులు తప్పవా? అనేది ఆ పార్టీ నేతల్లో మెదులుతున్న ఆలోచన.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!