Broiler Chicken : మనం నిత్యం తినే బ్రాయిలర్ కోడి మాంసం ఎంత వరకు ఉపయోగకరమో? దాని వల్ల ఆరోగ్యానికి ఇబ్బందా? లేదా? తెలుసుకుందాం!
Broiler Chicken : ఇప్పుడు అందరూ చౌకగా, అత్యంత తక్కువ సమయంలో తినే మాంసం ఆహారం ఏమిటింటే చికెన్ అని చెప్పవచ్చు. చికెన్ అంటే చిన్న పిల్లల మొదలు వృద్ధులు వరకూ చాలా సులువుగా తినే మాంసా హారం.చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరమో! అదే విధంగా ఆరోగ్యానికి అంతకంటే ప్రమా దం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ అత్యంత కండ కలిగిన ఆహారం. దీని వల్ల అధిక ప్రోటీన్సు లభించడంతో పాటు బరువు పెరగడానికి కూడా చాలా దోహదపడుతుంది. కానీ సాధారణంగా లభించే రకం బ్రాయిలర్ చికెన్ మీ ఆరోగ్యానికి చాలా నష్టం కలిగిస్తుంది. ఇది కండరాల ఆహారంగా పూర్తిగా నివారించాలి. సేంద్రీయ లేదా దేశీయ చికెన్ మాదిరిగా కాకుండా, బ్రాయిలర్ కోళ్లను వాటి మాంసం కోసం ప్రత్యేకంగా పెంచుతారు. శుభ్రం పాటించక పోవడంతో పాటు, వేలాది బ్రాయిలర్ కోళ్లను బోనుల్లో కలిసి పెంచుతారు. వాటిని పెంచడానికి, తక్కువ కాలంలో పెద్దవి కావడానికి యాంటీ బయాటిక్స్ , ఇతర రసాయనాలు ఇంజక్షన్ల ద్వారా అందజేశారు. అప్పుడు అవి సాధారణ కోడి కంటే దాదాపు మూడు రెట్లు వేగంగా పెరుగుతాయి.
నిజానికి మనం తినే బ్రాయిలర్ చికెన్ సంతృప్తి పడటానికి తప్ప శరీరానికి పెద్దగా ప్రయోజనం ఉండదనేది నిపుణులు సూచన. ప్రతి రోజూ లక్షలు, కోట్లు బాయిలర్ కోళ్లు అమ్ముడు పోతుంటాయి. మనం తినే బ్రాయిలర్ చికెన్‌లో అధికంగా యాంటీ బయాటిక్స్, హానికరమైన హార్మోన్లు మరియు పురుగు మందుల జాడలు కూడా ఉండే అవకాశం ఉంది. బ్రాయిలర్ కోడి పెంపకంలో Tetracyclines(such as doxycycline), Fluoroquinolones (such asenrofloxacin) మరియు Aminoglycosides (such as neomycin) లాంటి రసాయన పదార్థాలు ఉపయోగిస్తారు. ఈ రసాయనాలతో కలుషితమైన బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల కొంత మందిలో యాంటీబయాటిక్ (వ్యాధి నిరోధకత) తగ్గిపోతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక పిల్లలు అయితే త్వరగా యుక్తవయస్సు వచ్చే ప్రమాదానికి దారి తీస్తుంది.
విష ఆహారం!
బ్రాయిలర్ చికెన్ లో ఘోరమైన బ్యాక్టీరియా నివసించేందుకు ఆస్కారం ఉంది. మార్కెట్ నుండి తీసుకొచ్చిన బ్రాయిలర్ చికెన్ మాంసం శాంపిల్స్‌ను పరీక్షిస్తే మాత్రం Campylobacter spp మరియు Salmonella బాక్టీరియాలు ఉంటాయి. ఈ మాంసం క్రమం తప్పకుండా లేదా అప్పుడప్పుడు తీసుకోవ డం వల్ల అతిసారం, ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అతి తక్కువ కాలంలోనే రోగ నిరోధక శక్తి దగ్గి మనిషి బలహీన పడే అవకాశం ఉంది.
రోగ నిరోధక శక్తి తగ్గుదల!
బ్రాయిలర్ కోళ్లు సాధారణ కోళ్లు లాగా శరీరాన్ని పెంచి పోషించుకోలేవు. దీని వల్ల వాటికి తక్కువ ఆరోగ్యంతో పాటు, రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ఉంటాయి. అందువల్ల పౌల్ట్రీ రైతులు వాటిని యాంటీబయాటిక్స్‌ను ఇంజక్షన్ ద్వారా ఎక్కిస్తారు. ఇది బ్యాక్టీరియా యొక్క జాతులను ఉత్పత్తి చేసేందుకు సహాయ పడుతుంది. అప్పుడు ఆ బ్యాక్టీరియా లేదా వైరస్ భారిన పడిన చికెన్ తిన్నప్పుడు అనారోగ్యానికి గురైతే వైద్యుడు మీకు యాంటీబయాటిక్ ఇస్తారు. అవి వేసుకుంటూ మళ్లీ బ్రాయిలర్ చికెన్ తింటే మాత్రం మీ బాడీ త్వరగా కోలుకోదు. క్రమ క్రమంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!