Brilliant Thief | విశాఖపట్టణం జిల్లాలో ఓ విచిత్ర దొంగ పోలీసులకు చిక్కాడు. ఇతగాడిని విచిత్ర దొంగ అనేకంటే తెలువైన దొంగ అంటేనే బెటరేమో. ఎందుకంటే అతడు చోరీ చేసిన బంగారం దాచిన తీరు తెలిసి పోలీసులే కంగుతిన్నారంట. కానీ పాపం పండింది. అతని దొంగ బుద్దులు తెలిశాయి. ఎట్టకేలకు అతన్ని పట్టుకుని జైల్లో పెట్టారు పోలీసులు. విచిత్ర దొంగ (Brilliant Thief)వృత్తి ఎలక్ట్రీషియన్(electrician) అంట. చుట్టుప్రక్కల ఇళ్లలోని ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక్క ఫోన్ కొట్టి పక్కన పెట్టేలోపు ఆ ఇంటి వద్దకు క్షణాల్లో ప్రత్యక్షమవ్వడం ఇతని స్పెషాలిటీ.
వస్తాడు. ప్రాబ్లమ్ చూస్తాడు. ఆ తర్వాత తన చేతికి పని చెప్పడానికి తనకున్న మరో ప్రవృత్తిని కూడా అక్కడే ఇంప్లిమెంట్ చేస్తాడు. తాను కరెంటు పని చేసిన ఇంటిలోనే కన్నాలే వేయడం ప్రారంభించాట. బంగారం, వెండి వస్తువులు కాజేసి ఊడాయిస్తుంటాడు. ఇంతకీ దొంగిలించిన సొత్తును ఎక్కడ దాస్తున్నాడో తెలుసా? స్విచ్ బోర్డులు, కరెంటు మీటర్లలో భద్రంగా దాస్తున్నాడట. బాధితుల ఫిర్యాదుతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఎలక్ట్రీషియన్ దొంగతనం కహానీలు మొత్తం తమ స్టైల్లో బయట పెట్టించారు పోలీసులు. కరెంటు బాగు చేయడానికి రా బాబు అంటే పనిలో పని చోరీలకు పాల్పడుతున్నాడు ఈ వ్యక్తి. దీంతో వామ్మో ఇక నుంచి ఇంట్లోకి పని చేయడానికి వచ్చే ఎవర్నీ నమ్మే పరిస్థితి లేదని ఈ విషయం విన్నవారు ఆలోచిస్తున్నారట. ఎవరి మనుసులో ఏ కహానీలు ఉన్నాయో గుర్తించడం కష్టం కాబట్టి. జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు విశాఖ పోలీసులు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ