Breakup Quotes Telugu 2022: ప్రేమలో విఫలమైన వారిని ఒక్కసారి తట్టి చూస్తే వారి నుండి పెద్ద సూపర్ డూపర్ హిట్ అయే సినిమా లవ్ స్టోరీలు, మంచి మంచి కవితలు, డైలాగ్స్ ఇలా ఒకటేమిటి..చాలా వస్తాయి. ప్రేమ అనేది చాలా అమూల్యమైనది. అది ఒకరిని గెలిపిస్తుంది. మరొకర్ని ఓడిస్తుంది. ఇద్దరూ గెలిచిన ప్రేమ.. పెళ్లి వరకూ వెళుతుంది. ప్రేమ చిగురించడానికి కారణం చెప్పలేం కానీ, విడిపోవడానికి మాత్రం సవాలక్ష కారణాలు ఎదురవుతాయి. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రకమైన ప్రేమ బాధ.
Breakup Quotes Telugu 2022
1.నా లైఫ్లో నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు!
ఒకరి వల్ల ఇంత బాధ పడతానని,
బాధ పడాల్సి వస్తుందని!
2.మనతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే
మనల్ని వదిలించుకుంటున్నారని అర్థం!
3.ఎప్పటికైనా నాతో ప్రేమగా మాట్లాడతానని ప్రతిరోజూ
ఎదురు చూస్తూనే ఉన్నాను.కానీ..
నేను నీకేం అంత ముఖ్యం కాదని ప్రతిరోజూ తెలియజేస్తూనే ఉన్నావు!
4.నీకు నా తర్వాతే అందరూ అనుకున్నా..కానీ
ఇప్పుడు అర్థమైంది అందరి తర్వాతే నేనని!
5.నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను Good
నీకు ఇష్టం లేనప్పుడు నేను Bad హా!

6.మొత్తానికి ఒకటి నిర్ణయించుకున్నా
Busy గా ఉన్న వ్యక్తులను డిస్ట్రబ్ చేకూడదు అని..
ఎందుకంటే వాళ్లు ఇతరులతో Happy గా ఉన్నారు. నాతో కాదు!
7.నా గుండెలో నీ స్థానం గర్భ గుడిలో దేవుడిలా ఉంది!
నీ గుండెలో నా స్థానం గుడి బయట బిచ్చగత్తెలా ఉంది!
8.వాడుకోవాలి అని లైఫ్ లోకి వస్తారో! లేక
ఆడుకోవాలి అని లైప్ లోకి వస్తారో! తెలియదు కానీ..
మనకు లైఫ్ అంటేనే ఇష్టం లేకుండా చేసేస్తారు!
9.నా లైఫ్ని చాలా అందంగా ఊహించుకున్నా కానీ
ఇలా ఎవరికీ చెప్పుకోలేని బాధతో ఎవరికీ కనపడని కన్నీళ్లతో
ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు!
10.మన జీవితంలో మనం చేసే పెద్ద తప్పు
ఏమిటో తెలుసా!
మనం అంటే లెక్కలేని వాళ్ళను మనం
లెక్కలేనంత గా ఇష్టపడటం!
11.కొన్ని బంధాలు అంతే
మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి కానీ
వారికీ కావాల్సిన వాళ్లు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు!
12.ఎవరినీ మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు
ఇష్టం ఉన్నవాళ్లు ఎన్ని సమస్యలున్నా ఎదురించి
నీ తోడుగా నిలుస్తారు!
ఇష్టం లేనివారు కారణాలను వెతికి మరీ దూరమవుతారు!
13.ఒకే ఒక్కసారి నువ్వు నీలా కాకుండా
నాలా ఆలోచించి చూడు!
నా మనసు పడే వేదన, ఆవేదన నీకు అర్థమవుతుంది!
14.నీ కోసం నేను పడే తపన ఈ రోజు నీకు తెలియక పోవచ్చు.
కానీ..ఏదో రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. నీకు తెలిసే
సమయానికి నేను ఉండకపోవచ్చు!
15.ఎంతగా అభిమానించినా ఎంతగా ప్రేమించినా
ఎంతగా కేర్ చూపించినా కొంత మంది దృష్టిలో
మనం ఎప్పుడూ పరాయివాళ్లమే!
16.కొన్ని పరిచయాలు ఎంత సంతోష పెడతాయో
చివరికి బాధ పెడతాయి!
17.ప్రతి అమ్మాయికి కోరికలు ఉంటాయి కానీ..
కొందరు కోరిక కలిగినప్పుడు మనసుకి నచ్చిన
వాడితో మాత్రమే ఒంటిని పంచుకోవాలి అనుకుంటారు!
అది ఆ రెండు మనసులు ఒక్కటిగా ఉన్నప్పుడు
మాత్రమే ఆ అమ్మాయి తన శరీరాన్ని తనకి నచ్చిన
వాడికి బహుమతిగా ఇస్తుంది. బహుమతిగా ఇస్తుంది
అంటే ఇలా ఎంత మందికి ఇచ్చిందో అని కాదు!
అందరి ముందు కాపాడుకున్న శరీరాన్ని నీ ముందు
పెడుతుంది అంటే నిన్ను ఎంత నమ్మి ఉంటుంది?
శరీరాన్ని ఇచ్చింది కదా అని వదిలేసి వెళ్లిపోవడం
కాదు మగతనం అంటే ఒక అమ్మాయిని ముట్టుకోగలిగితే
చచ్చేదాక పట్టుకొని బతకగలిగితేనే ముట్టుకోవాలి!
18.నా వల్ల నువ్వు బాధ పడొద్దు
తెలియక నీ జీవితంలోకి వచ్చాను. ఎలా
వచ్చానో అలానే వెళ్లి పోతాను. నాకు
తెలియకుండా నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు!
19.గాయపడిన వాడికి తెలుస్తుంది!
దాని వల్ల కలిగే బాధ అంతే గాని
గాయం చేసిన వాడికి ఏం తెలుస్తుంది ఆ బాధ!
20.బాధ పెట్టడం నీకు అలవాటైపోయింది
బాధ పడుతూ కూడా నిన్ను ప్రేమించడం నాకు
అలవాటైపోయింది!
21.ఈ రోజుల్లో ఐతే నటించడం ఐనా రావాలి
లేదా మోసం చెయ్యడం ఐనా రావాలి
నిజాయతీగా ఉంటే బ్రతకలేవు!
22.నీకు నాకు చాలా అంటే చాలా తేడా ఉంది
నాకు నువ్వు తప్ప ఇంకెవరూ వద్దు. కానీ
నీకు నేను తప్ప అందరూ కావాలి.
23.మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుబడతారు
కానీ వాళ్ల ప్రవర్తన వలనే మనం మారామని ఎప్పటికీ గుర్తించరు!
24.ఎంత అందుబాటులో ఉంటామో
అంత లోకువ అయిపోతాం
ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో
అంత చీప్ అయిపోతాం!

25.నా జీవితంలో ఎవరినీ బలవంతంగా ఉండమని
నేను కోరుకోను!
ఎందుకంటే ఇష్టంతో ఉంటే మనసుకి హాయిగా ఉంటుంది!
కష్టంతో ఉంటే మనసుకి భారంగా ఉంటుంది!
26.నువ్వు ఇంకెప్పుడూ నాకు ఫోన్ కానీ
మెసెజ్ కానీ చేయకు..
మనవి కావు అనుకున్న బంధాలను
మళ్లీ కలపకు..
27.విడిపోవాలని నువ్వు Decide
అయినప్పుడు కలిసి ఉండాలని నేను
వాధించడంలో అర్థం లేదు
28.మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్లనే
మనం ఎక్కువుగా లవ్ చేస్తాం!
వాళ్లు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం!
కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని
వేరే వాళ్లతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతే
మనం తెలుసుకోలేకపోతున్నాం!
29.జరిగి పోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్
అని నాకు తెలుసు కానీ..
జరిగిపోయిన దాంట్లో నా జీవితం ఉంది..
దాన్ని నేనెలా మర్చిపోగలను?
30.మనది అని రాసి పెట్టి ఉంటే
ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే
అది మనకే దక్కి తీరుతుంది
అది వస్తువైనా మనిషైనా ప్రేమైనా సరే!!
-
Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
Noogler Benefits: ఉద్యోగం అంటే ఏదో నెలకు రూ.10 వేలు జీతం తీసుకునే మధ్యతరగతి కుటుంబాలు కోట్లలో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టతరమైనది. మరీ Amazon, walmart, టాటా స్టీల్ కంపెనీల్లో ఉద్యోగం అంటే ఇక దేవుడు వరమిచ్చినట్టే. ఇక ప్రపంచానికే టెక్నాలజీలకు తల్లి, గురువు అయిన గూగుల్ కంపెనీలో ఉద్యోగం అంటే ధనలక్ష్మి వడిలో పడినట్టే లెక్క. అవును మంచిగా చదువుకోవాలే గానీ పెద్ద పెద్ద కంపెనీలు […]