breaking news

breaking news : ఇంట్లో అగ్నిప్ర‌మాదం వృద్ధురాలు స‌జీవ‌ద‌హ‌నం

Spread the love

breaking news : Vijayanagaram : విజ‌య‌న‌గ‌రం జిల్లా పార్వ‌తీప‌రం ప‌ట్ట‌ణం దేవీన‌గ‌ర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి అగ్ని ప్ర‌మాదం(fire accident) చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో వృద్ధురాలు స‌జీవ‌ద‌హ‌నం అయ్యింది. న‌లుగురికి గాయాలు అయ్యాయి. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.మృతురాలు సుబ్బ‌ల‌క్ష్మి(66) గా గుర్తించారు. గాయ‌ప‌డ్డ‌వారిని పార్వతీపురం ఏరియా హాస్పిట‌ల్‌కు త‌రలించారు. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిందా? లేదా ఇంకా ఏమైనా కార‌ణాలు ఉన్నాయా? అని అగ్ని మాప‌క అధికారులు విచార‌ణ చేప‌డుతున్నారు.


అమ‌ర ఆసుప‌త్రిలో నిర్ల‌క్ష్యం!

Tirupati : తిరుప‌తి, క‌ర‌కంబాడీలో గ‌ల అమ‌ర ఆసుప‌త్రి(Amara Hospital)లో డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఓ అమాయ‌కుడు బ‌లైన‌ట్టు కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే తిరుప‌తిలోని ఉపాధ్యాయ న‌గ‌ర్‌కు చెందిన పి.వి కుమార్ శేఖ‌ర్ ఇంజ‌నీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురై అమ‌ర ఆసుప‌త్రి బ‌య‌ట కుర్చీలోనే ఊపిరితో స్పృహ కోల్పోయారు. ఏమి చేయ‌ని నిస్స‌హాయ స్థితిలో ఉన్న ఆయ‌న భార్య త‌న భ‌ర్త ప్రాణాలు కాపాడాలంటూ వేడుకున్న‌ప్ప‌టికీ డాక్ట‌ర్లు క‌నిక‌రించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

మ‌రో వైపు తిరుప‌తిలో రుయా(ruya) ఎఫ్ ఎస్ వార్డులో పేషెంట్ల మ‌ధ్య‌లో రాత్రంతా క‌రోనా మృత‌దేహం ఉన్న ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మృతురాలి బంధువుల‌తో వార్డు బాయ్ బేర‌సారాలు ఆడిన‌ట్టు తెలుస్తోంది. శుక్ర‌వారం రాత్రి నుండి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు వార్డుల్లోనే మంచంపైన మృత‌దేహం ఉన్న‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు.

vaccine drive:త్వ‌ర‌గా పూర్తి చేయండి వ్యాక్సినేష‌న్: మంత్రి హ‌రీష్ రావు

vaccine driveహైద‌రాబాద్: రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికీ రెండు డోసులు వ్యాక్సిన్ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు అన్ని జిల్లాల వైద్యాధికారుల‌ను ఆదేశించారు. Read more

covid update: త‌గ్గిన‌ట్టే త‌గ్గి ఒక్క‌సారిగా అమాంతం పెరిగి.. కేర‌ళ‌ను వ‌ణికిస్తోన్న క‌రోనా!

covid update: ఢిల్లీ: దేశంలో క‌రోనా కేసుల్లో హెచ్చు త‌గ్గులు క‌న్పిస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా 20 వేల దిగువ‌కు ప‌డిపోయిన కొత్త కేసులు, తాజాగా మ‌ళ్లీ Read more

corona cases: జాగ్ర‌త్త‌..జాగ్ర‌త్త‌..రాజ‌ధానిలో మ‌ళ్లీ విస్త‌రిస్తున్న వైర‌స్‌| ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు క్యూ క‌డుతున్న బాధితులు

corona cases: క‌రోనా రెండో ద‌శ వెళ్లిపోయిందిలే అనుకుంటే పొర‌పాటు అంటున్నారు వైద్యులు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న మొద‌ల‌వుతుంది. హైద‌రాబాద్: Read more

Third wave of Corona : థ‌ర్డ్‌వేవ్ ముంచుకొస్తుందా? సెకండ్‌వేవ్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మా?

Third wave of Corona : భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు థ‌ర్డ్‌వేవ్ భ‌యం ప‌ట్టుకోంది. సెకండ్‌వేవ్ తీవ్ర‌త Read more

Leave a Comment

Your email address will not be published.