bread halwa recipe | హల్వా అంటేనే నోరూరిపోతుంది. అలాంటిది బ్రెడ్ హల్వా అంటే ఇంకా మరింత ఉత్సాహం వేస్తుంది. మనం స్నేహితులు ఇంటికి వెళ్లినా, బంధువుల ఇంటికి వెళ్లినా, శుభకార్యాలకు వెళ్లినా halwa పెడితే మాత్రం ముందు దానినే రుచి చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఆరెంజ్ బ్రెడ్ హల్వా గురించి మాట్లాడుకుందాం. మనం బయట నుంచి తీసుకొచ్చి తినే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నిసందర్భాల్లో మనకు బయట దొరక్కపోతే అప్పుడెలా? కాబట్టి ఆరెంజ్ బ్రెడ్ హల్వా ఇంటిలోనే చేసుకుంటే ఇంకా మంచిది కదా!. కాబట్టి హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు కింద తెలియజేశాం. వీటి ఆధారంగా మీరు ఇంటిలో Orange బ్రెడ్ హల్వా తయారు చేసుకోవచ్చు.
bread halwa recipe:ఆరెంజ్ బ్రెడ్ హల్వా తయారీ
కావాల్సిన పదార్థాలు!
బ్రెడ్ sliceలు- 8
ఆరెంజ్ జ్యూస్- 1/2 కప్పు
కేసర్ ఎల్లో కలర్- చిటికెడు
కోవా- 1/4 కప్పు
Milk- 1 కప్పు
నెయ్యి- 3 చెంచాలు
పంచదార- 1/2 కప్పు
యాలకుల పొడి- 1/4 చెంచా
జీడిపప్పు- 5
badam- 5
కిస్మిస్- 10
వండండి ఇలా..!
బ్రెడ్ స్లైసులు అంచులు తీసి నేతిలో వేయించుకోవాలి. ఇందులోనే పాలు పోసి ఉడికించుకోవాలి. తర్వాత పంచదార, కోవా, కిస్‌మిస్ వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. తర్వాత ఆరెంజ్ juice వేసి కలపాలి. కొద్దిగా చిక్కబడ్డాక కేసర్ రంగు, యాలకుల పొడి, మరికొంచెం నెయ్యి వేసి కలిపి దింపేయాలి. సన్నగా తరిగిన జీడిపప్పు, బాదాం ముక్కలు వేసి వేడిగా సర్వ్ చేయాలి. కావాలంటే కొద్దిగా ఆరెంజ్ ఎసెన్స్ వేసుకోవచ్చు. అప్పుడు యాలకులు వేయవద్దు.