Brave girl

Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ

Share link

Brave girl | కుమారి Hunnybhai Rathod వ‌య‌సు 12 సంవ‌త్స‌రాలు. Madhya Pradeshలోని రాయ‌ఘ‌డ్‌లో ఉంటోంది. త‌న తండ్రి ధీర‌జ్ రాథోడ్ ఆ రాత్రి మెయిలుకు కల‌క‌త్తా వెళుతుంటే ఆయ‌న‌ను సాగ‌నంపి త‌ల్లి Anubhaiతో ఇంటికి తిరిగి వ‌స్తోంది. టైము 9 గంట‌లు దాటింది. వ‌ర్షం ప‌డిందేమో దారి స‌రిగ్గా లేదు. పై పెచ్చు క‌రెంటు కూడా పోయింది. ఆ చీక‌టిలో త‌మ‌ని వెంబ‌డిస్తున్న ముగ్గురు దుండ‌గుల‌నువారు గ‌మ‌నించ లేదు. త‌ల్లీ కూతురు రైల్వే ఆసుప‌త్రి ద‌గ్గ‌ర నుంచి ముందుకు సాగుతున్నారు. ఆ ప్ర‌దేశం నిర్జ‌నంగా ఉంది. అంత‌లో అదును చూసుకుని దుండ‌గుల‌లో ఇద్ద‌రు వారిని అడ్డ‌గించి అనూబాయ్ మెడ‌లోని మంగ‌ళ‌సూత్రాన్ని గుంజుకోవ‌డానికి ప్ర‌య‌త్నించారు.

ఆమె ఎదిరించ‌బోయేలోగా ఒక‌డు చాకుతో అనూబాయ్ ఛాతిపై పొడిచాడు. ఇది చూసిన హున్నీబాయ్ త‌న త‌ల్లిని ర‌క్షించే ప్ర‌య‌త్నంలో ముందుకు రాగా రెండోవ వాడు ఆమె క‌డుపులో చాకుతో రెండు సార్లు పొడిచి త‌ప్పించుకుని పారిపోసాగాడు. ఆ చిన్న‌పాప‌కు తీవ్రంగా గాయ‌లు త‌గిలి ర‌క్తం కారుతున్న లెక్క చేయ‌క ధైర్యాన్నిచిక్క‌బ‌ట్టుకుని పారిపోతున్న ఆ దొంగ చొక్కాకాల‌రు చేతికి దొరికితే, దానినే గ‌ట్టిగా ప‌ట్ట‌కుంది. వాడు ఎంత గుంజుకున్న హున్నీబాయ్ ఉక్కు పిడికిలిలో చిక్కిన వాడి కాల‌రు ఊడిరాలేదు. వాడు చాలా బ‌లంతో చొక్కా ప‌ట్టుకుని గుంజుకున్నాడు. ఆ గుంజాటంలో వాడి చొక్కా చిరిగిపోయింది.

కానీ హున్నీ బాయ్ మాత్రం దానిని వ‌ద‌ల‌లేదు. ఆమె గుప్పిట్లోనే మిగిలిపోయింది. దొంగ వ‌దిలించుకుని పారిపోయాడు. ఇదంతా ద‌గ్గ‌ర‌లోనే పొంచి ఉండి చూస్తున్న మూడువ వాడు గాయాల‌తో ర‌క్తం కారుతూ అప‌స్మార‌క స్థితిలో భూమిపై కొరుగుతున్న త‌ల్లీబిడ్డ‌ల‌ను స‌మీపించి త‌ల్లిమెడ‌లోని మంగ‌ళ సూత్రాన్ని తెంపుకుపోయారు. ఈ లోగా త‌ల్లీబిడ్డ‌ల కేక‌లు, ఆక్రంద‌న‌లు చుట్టు ప‌క్క‌ల ఉండే వారి చెవిన ప‌డ‌గా వారు వ‌చ్చి ఆ ఇద్ద‌రినీ ఆసుప‌త్రిలో చేర్చారు. అప్ప‌టికే వారిద్ద‌రూ పూర్తిగా స్పృహ కోల్పోయారు. అయితే చిన్నారి హున్నీభాయ్(Brave girl) త‌న గుప్పిట‌లోని చొక్కా కాల‌రును అలాగే ప‌ట్టుకుని ఉంది. అదే రాత్రి 10.30 గంట‌ల‌కు ఈ సంఘ‌ట‌న గురించి పోలీసుల‌కు తెలియ‌జేశారు.

పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగారు. ఆసుప‌త్రిలో తీవ్ర‌మైన గాయాల‌తో సీరియ‌స్‌గా ఉన్న హున్నీ అనూబాయ్‌ల‌ను వారు ప‌రిశీలించారు. హున్నీ పిడికిలిలోని కాల‌రుగుడ్డ ముక్క తీసుకుని నిశితంగా ప‌రీక్షించారు. ఆ కాల‌రు వెనుక దానిని కుట్టిన ద‌ర్జీవాని గుర్తు క‌నిపించింది. దాని ఆధారంతో ద‌ర్జీ వానిని ప్ర‌శ్నించ‌గా ఆ చొక్కాను రాయ్‌పూర్‌లోని యోగీష్‌ద‌త్తా అనే వ్య‌క్తి కోసం కుట్టిన‌ట్టు తెలిసింది. వెంట‌నే యోగీష్‌ద‌త్తాను ప‌ట్టుకుని ఆచూకీ తీయ‌గా మిగిలిన ఇద్దరి దుండగుల ఉనికి తెలిసింది. అనూబాయ్ మంగ‌ళ‌సూత్రం వారి వ‌ద్ద దొరికింది.

Brave girl: క‌రుడుక‌ట్టిన నేర‌గాళ్లు

ఇలాంటి నేరాలు అనేకం చేసి రైళ్ల‌లో దొంగ‌త‌నాలు చేసి త‌ప్పించుకు తిరుగుతున్న పాత నేర‌స్తులు వాళ్లు. వాళ్లు చేసిన నేరాల‌న్నింటికీ న్యాయ‌స్థానం త‌గిన శిక్ష విధించింది. గాయాలు త‌గిలిన హున్నీ, త‌ల్లీ అనూబాయ్‌కి చాలా కాలం వ‌ర‌కు వాపులు త‌గ్గ‌లేదు. వారు బీద‌వారు కావ‌డంతో గ‌త్యంత‌రం లేక అలాగే ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోనే అవుట్ పేషంట్లుగా వైద్యం చేయించుకుంటున‌నారు. 12 ఏళ్ల ప‌సిబాల హున్నీ బాయ్ ప్ర‌ద‌ర్శించిన ప‌ట్టుద‌ల‌, అస‌మాన ధైర్య సాహ‌సాల మూలంగానే దుండ‌గులు ప‌ట్టుబ‌డ్డారు. ఆ అమ్మాయిని అభినందిస్తూ బిలాన్‌పూర్‌లో డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఒక ప్ర‌త్యేక స‌భ ఏర్పాటు చేసి ఆ త‌ల్లీబిడ్డ‌ల‌కు రూ.500 (అప్ప‌ట్లో) బ‌హుమ‌తి ఇచ్చారు. రాయ‌ఘ‌డ్‌లోని మునిసిపాలిటీ, పౌరులు క‌లిసి రూ.2,500 విరాళంగా పోగు చేసి ఇచ్చారు. కె.కె గుప్తా అనే వ్య‌క్తి కుమారి హున్నీ చ‌దువుల‌క‌య్యే ఖ‌ర్చుల‌న్నీ భ‌రిస్తాన‌ని వాగ్దానం చేశాడు. ఆ పాప ధైర్య సాహ‌సాల కీర్తి కిర‌ణాలు(Brave girl) ఢిల్లీ దాకా పాక‌డంతో అప్ప‌టి ప్ర‌ధాని శ్రీ‌మ‌తి ఇందిరా గాంధీ 1983 సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 24న ఆమ‌కు గీతాచోప్రా (Geetha chopra award)పేరిట ఒక ప్ర‌త్యేక జాతీయ బ‌హుమానాన్ని అంద‌జేశారు.

sai baba message today: త‌న భ‌క్తుల‌కు సాయి బాబా చెబుతున్న‌దేమిటి?

sai baba message today: నాలుక‌, కోపం, కోరిక ఈ మూడింటినీ అదుపులో ఉంచుకోవాలి. గురువు, త‌ల్లిదండ్రులు, దైవం ఈ ముగ్గురినీ గౌర‌వించాలి. ప‌విత్ర‌త‌, నిజాయితీ, క‌ఠోర‌శ్ర‌మ Read more

What is Self Confidence: నీ మీద నీకు న‌మ్మ‌కం ఉంటే ఎవ‌రినైనా న‌మ్మించ‌గ‌ల‌వు! (స్టోరీ)

What is Self Confidence: న‌మ్మ‌కం!. ఈ ప‌దం చాలా చిన్న‌ది అయినా ఇది ప్ర‌భావితం చేస్తే పేద‌వారు ధ‌న‌వంతులు అవుతారు. డ‌బ్బు లేని వారు డ‌బ్బును Read more

Money Motivation: మ‌న కాళ్ల కింద కూడా డ‌బ్బులు ఉన్నాయి..కాక‌పోతే న‌మ్మ‌కం లేదు! (స్టోరీ)

Money Motivation: డ‌బ్బు సంపాదించాల‌నే మీ క‌లకు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆగిపోవ‌ద్దు. ప్ర‌తి ఒక్క‌రం సంపాదిస్తేనే పేరు, ప్ర‌ఖ్యాత‌లు ఉంటాయి. కుటుంబం కూడా బాగుంటుంది. డ‌బ్బుకు Read more

Soichiro Honda: భ‌యంక‌ర‌మైన క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాడు..ఆఖ‌రికి హీరోహోండా మెన్ అయ్యాడు! (స్టోరీ)

Soichiro Honda | 1938 ప్రాంతంలో Tokyo న‌గ‌రంలో ఒక కుర్రాడు స్వ‌తంత్రంగా Car Piston రింగులు త‌యారు చేశాడు. అతి కష్టం మీద ట‌యోటా కంపెనీ Read more

Leave a Comment

Your email address will not be published.