brahmagupta formula ప్రపంచానికి సున్న(zero)ను పరిచయం చేసింది మన దేశమేనని గర్వంగా చెప్పుకుంటాం. ఆ సున్న ను కనిపెట్టి లెక్కలను సులభతరం చేసిన మేధావి బ్రహ్మ గుప్త. గణిత శాస్త్ర నైపుణ్యానికి ప్రతీక అయిన ఉజ్జయినిలోని ఖగోళ పరిశోధన శాల అతడి ఆధ్వర్యంలోనే నిర్మితమైంది. వ్యాఘ్రముఖ రాజు ఆస్థానంలో గణిత శాస్త్ర నిపుణుడిగా సేవలందించారు బ్రహ్మగుప్త.
బ్రహ్మస్పూత సిద్ధాంతం(brahmagupta formula)
ఖండఖాద్యక, దుర్కీమైనార్థ, బ్రహ్మస్ఫూత సిద్ధాంత, కదమకేల అనే గ్రంథాలు రాశారు. సున్న అంటే విలువలేనిదిగా శూన్యం అని చెప్పడానికి చిహ్నంగా వాడేవారు. అలాంటి సున్నతో లెక్కలను గణించే పద్ధతిని బ్రహ్మస్ఫూత సిద్ధాంత గ్రంథంలో వివరించారాయన. ఇతడు క్రీ.శ 598 లో రాజస్థాన్ రాష్ట్రంలోని భిన్మల్ గ్రామంలో పుట్టారు. ఇతడు ఎంతటి మేధావి అంటే భూమి బల్లపరుపుగా ఉండదని, గుండ్రంగా ఉంటుందని ప్రతిపాదించాడు.

ఖగోళశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి గణిత శాస్త్రాన్ని మాధ్యమంగా చేసుకున్న ఘనాపాటి ఆయన. సౌరమానం ప్రకారం ఏడాదికి 365 రోఉల, 5 గంటల, 19 సెకన్లని కూడా గణించి చెప్పారు. ఆయన పూర్తి జీవితమంతా గణిత శాస్త్ర అధ్యయనం, గణితాన్ని ఇతర సామాన్య శాస్త్రాలకు వర్తింప చేసి పరిశోధించడంలోనే గడిపారు. నిరంతరం అంకెలతో లెక్కలతో సాగడం వల్లనే ఆయన మెదడు అంత చురుగ్గా ఉండేది. లెక్కలు చేయడంలో ఒత్తిడికి లోనవకుండా ఆ పనిని ఆస్వాదించడం వల్లనే అది సాధ్యం. అలాంటి బ్రహ్మగుప్త అందరికీ స్ఫూర్తి ప్రధాత అనే చెప్పాలి.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!