Born in May: అంకెల్లో దాగివున్న అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారా?. మీరు ఏ నెలలో పుట్టిన దాని ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మే నెలలో పుట్టిన వారి అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!
Born in May:మే నెలలో పుట్టిన వారి ఫలితాలు
మే నెలలో పుట్టిన స్త్రీ, పురుషులకందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. మే నెలలో పుట్టిన వారికి త్యాగబుద్ధి ఎక్కువ. ప్రయాణాల మీద అభిరుచి, కొత్త ప్రదేశాలు చూడాలన్న కోరిక వారిలో ఎక్కువుగా ఉంటుంది. పార్టీలు చేసుకోవడం అంటే వీరికి ఒక సరదా. వీరికి ఉదార బుద్ది ఎక్కువ. ఓర్పు కూడా చాలా ఎక్కువట.అందర్నీ ప్రేమిస్తారట. ఇతరులచే ప్రేమించబడతారు.
మే నెలలో పుట్టిన (BORN IN MAY) వారు ఉన్న శక్తిని దారపోస్తారు. మానసికంగా, శారీరకంగా త్యాగ బుద్ధి ఉంటుంది. చివరికి వీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందరితో స్నేహభావంగా ప్రేమగా ఉంటారు. స్నేహితు లకు పార్టీలు ఇస్తారు. ఆహారమునుకు ప్రాముఖ్యత ఇస్తారు. అవసరం అయితే మంచివంటలు స్వయంగా తయారు చేసుకోగలరు.
ఇంటిని పరిశుభ్రంగా, అందంగా, కళాత్మకంగా అలకరించు కొంటారు. వీరిలో మంచి కళాకారులు కూడా ఉన్నారు. వీరికి శృంగార వాంఛ ఎక్కువ. నమ్మని వారికి, వారు ఇష్టపడ్డవారికి ప్రాణాలు పోస్తారు. న్యాయం గా, ధర్మంగా పోరాటం చేస్తారు. అందువల్ల చివరకి వీరు ఓటమిని అంగీకరించవల్సిన అవసరాలు రావ చ్చు. వీరిలో చాలా మందికి చిన్న వయసులోనే వివాహం అవుతుంది. వీరి ప్రేమ విఫలం అవుతుంది.

ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, కళాకారులు ఉన్నారు. మరియు వీరిలో మంచి ప్రజా సేవకులు కూడా ఉన్నారు. మంచిస్థాయిలో, గౌరవ స్థానంలో ఉంటారు. ఈ నెలలో (Born in May) పుట్టిన వారు మంచి పేరు, గౌరవం సంపాదించు కుంటారు.
ఆరోగ్యం (Health): ఈ నెలలో పుట్టిన వారికి కిడ్నీ వ్యాధులు, రక్తపోటు సంబంధించిన వ్యాదులు రావచ్చును.
ధనము: వీరికి ధనము సంపాదించాలన్న కోరిక ఎక్కువుగా ఉంటుంది. సంపాదిస్తారు..అనుభవిస్తారు.
లక్కీ వారములు: మంగళవారము, శుక్రవారములు మంచి అదృష్టాన్ని ఇస్తాయి.
లక్కీ కలర్ దుస్తులు: బ్లూరంగు, రోజ్ కలర్ దుస్తులు మంచివి.
లక్కీ స్టోన్స్: ముత్యము లేదా డైమండ్ ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.