Born in June: జూన్ నెల‌లో పుట్టిన వారి ఫ‌లితాలు ఇలా ఉంటాయ‌ట‌!

Born in June: అంకెల్లో దాగివున్న అదృష్టం ప‌రీక్షించుకోవాల‌నుకుంటున్నారా?. మీరు ఏ నెల‌లో పుట్టిన దాని ఫ‌లితాలు తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే జూన్‌ నెల‌లో పుట్టిన వారి అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!

Born in June: జూన్ నెల‌లో పుట్టిన వారి ఫ‌లితాలు

జూన్ నెల‌లో పుట్టిన స్త్రీ పురుషుల గుణ‌గ‌ణ‌ములు గురించి ఇక్క‌డ తెలుసుకుందాం. ఈ నెల‌లో పుట్టిన వారు మంచి తెలివి తేట‌లు క‌ల‌వారంట‌. వీరి మెద‌డు చాలా ప‌దునైన‌ది. వీరికి అదృష్టం కూడా ఎక్కువేనండోయ్‌. వీరి కోరిక‌లు నెర‌వేరుతాయి. వీరికి తొంద‌ర‌పాటు ఎక్కువ‌. ఏ విష‌యాన్ని అయినా వెంట‌నే ప్రారంభించాల‌ని ప్ర‌య‌త్నిస్తారు.

జూన్ నెల‌లో జ‌న్మించిన (Born in June) వారికి గొప్ప తెలివితేట‌లుంటాయి. వారి మేధాశ‌క్తి అద్బుతం. ఏ విష‌యాన్ని అయినా వెంట‌నే గ్ర‌హించ‌గ‌ల‌రు. వెంట‌నే ప‌నులు ప్రారంభిస్తార‌ట‌. విజ‌యం పొందుతారు. న‌లుగురిలో గుర్తించ‌ప‌బ‌డ‌తారు. ప్ర‌తీ విషయాన్ని మ‌న‌స్పూర్తిగా న‌మ్మిన త‌రువాత ఆచ‌ర‌ణ‌లో పెడతార‌ట‌. వీరికి న‌మ్మ‌కం ఎక్కువ‌. అయితే ప్ర‌తీ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చేయాల‌ని ఆశ ప‌డ‌తార‌ట‌.

ఈ నెల‌లో పుట్టిన వారు విశ్వ‌సించిన ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించి గొప్ప విజ‌యములు సాధిస్తారు. వారు చేప‌ట్టిన ఏ ప‌నైనా ఘ‌న విజ‌య‌ములు సాధించాల్సిందేన‌ట‌. న‌లుగురిలో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తారు వీరు. న‌లుగురికి ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. కొంద‌రికి విడ‌దీయ‌లేని చిక్కు ప్ర‌శ్న‌గా వీరు క‌నిపిస్తార‌ట‌. గృహ అలంక‌ర‌ణ‌, విందులు, వినోదాలు అంటే వీరికి చాలా ఇష్టం అట‌. ఇలాంటి వాటికి స‌మ‌యం కేటాయిస్తార‌ట‌. ఆనందం పొందుతారు. వీరు మంచి భోజ‌న ప్రియులు.

జూన్ నెల‌లో పుట్టిన(Born in June) వారి జీవితంలో అనుకోకుండా క‌ష్టాలు వ‌స్తాయి. అయిన‌నూ అవి వారిని ఏమీ చేయ‌లేవు. క‌ష్ట‌ములు త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారు. కాస్త బాధ‌కు గురైనా అవి మ‌రిచి మంచి పొజిష‌న్ సాధించుకుంటారు. వీరు వీరి జీవితంలో ఎన్నో ఘ‌న విజ‌య‌ములు సాధించుకుంటారు. ఫ‌లితం అనుభ‌విస్తారు. ఈ Month లో పుట్టిన వారు తెలివి తేట‌లు క‌ల‌వారంట‌. శ‌క్తి వంతులు నూత‌న ప్ర‌య‌త్న‌ములు చేస్తారు. మాన‌సిక శ‌క్తి ఎక్కువ వీరికి, ఎప్పుడూ విజ‌య‌ముల‌నే సాధిస్తారు.

జూన్ నెల‌

Born in June: ఏది ఎలా ఉంది?

ఆరోగ్యం: ఈ నెల‌లో పుట్టిన వారికి నీర‌సం, బ‌ల‌హీన‌త‌, ర‌క్త‌పోటు, వ్యాధుల వ‌ల్ల బాధ‌ప‌డే అవ‌కాశం ఉంది.

ధ‌న‌ము: స్వ‌యంకృషి వ‌ల్ల , వ్యాపార రిత్యా డ‌బ్బు సంపాదిస్తారు.

ల‌క్కీ వార‌ములు(lucky Day): ఆదివార‌ము, బుధ‌వార‌ము మంచి అదృష్టాన్ని ఇస్తాయి.

ల‌క్కీ క‌ల‌ర్ (lucky colour) దుస్తులు: ప‌సుపు, ఆకుప‌చ్చ‌రంగు దుస్తులు ధ‌రిస్తే అదృష్టం క‌లిసివ‌స్తుంది.

ల‌క్కీ స్టోన్స్: ఆకుప‌చ్చ స్టోన్‌, తెలుపురంగు స్టోన్ ధ‌రిస్తే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *