Booster Rocket | మూడు టన్నులకు పైగా ఉన్న రాకెట్ విడిభాగం ఒకటి చంద్రుడ్ని వెనుక వైపు ఢీకొట్టిన తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు జాబిల్లిని ఢీకొట్టినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గంటకు 9,300 వేగంతో చంద్రుడ్ని ఢీకొట్టడంతో ఓ గుంత ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఆ గుంత ఎంత వెడల్పు, పరిమాణం ఉన్నదనేది తేల్చాలంటే వారం రోజులు సమయం పడుతుందని (Booster Rocket)తెలిపారు.
యూరోపియన్ స్పేస్ అంచనా ప్రకారం 36,500 స్పేస్ జంక్ ముక్కలు 10 సెంటీమీటర్లు కంటే పెద్దవిగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో కొన్ని ముక్కలు భూమికి దగ్గరుగా ఉన్నట్టు భావిస్తున్నారు. చంద్రుడ్ని రాకెట్ శకలం ఒకటి ఢీకొన్నబోతుందని జనవరిలోనే అంచనా వేశారు. 2015లో స్పేస్ ప్రయోగించిన పాల్కన్ రాకెట్ల లోని భాగమనుకున్నారు. అయితే అది కాదని, 2014లో చైనా ప్రయోగించిన రాకెట్లో భాగం కావచ్చని అంచనా వేస్తున్నారు.
చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉండటందు కాబట్టి, అంతరిక్షం నుండి పడే ఉల్కలను, శకలాలను భూమిలా దగ్దం చేసే సత్తా చంద్రుడికి లేదు. చంద్రుడు ఏర్పడిన నాటి నుంచి ఉల్కాపాతాలు, గ్రహ శకల పతనాల వల్ల ఏర్పడిన అంసంఖ్యాక బిలాలు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు రాకెట్ విడిభాగం ఢీకొట్టడం వల్ల ఏర్పడే బిలాన్ని కొన్ని నెలల వరకు పసిగట్టే పరిస్థితి లేదని సైంటిస్టులు చెబుతున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!