Mutton Biryani recipe: బోన్‌లెస్ మ‌ట‌న్ బిర్యానీ త‌యారీ

Mutton Biryani : బిర్యానీ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు. నోరురూరించే బిర్యానీ అంటే ప్ర‌తి ఒక్క‌రికీ ఇష్ట‌మే. వారంలో వీలైన రోజులో ముఖ్యంగా శ‌నివారం, ఆదివారం బిర్యానీ తిన‌కుండా ఉండ‌రు. బిర్యానీ ప్రియుల‌కు ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. బిర్యానీలో ఎన్ని ర‌కాలు ఉంటే అన్ని ర‌కాల‌ను రుచి చూస్తారు. ఎక్క‌డ హోట‌ల్‌లో మంచిగా బిర్యానీ ఉంటుందంటే అక్క‌డ‌కు ప్ర‌యాణ‌మ‌వుతారు. బిర్యానీ ఎక్క‌డ టేస్టీగా ఉంటుందో కూడా ఇత‌రుల‌కు ట‌క్కున చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఇంటిలో చేసుకునే బోన్‌లెస్ Mutton Biryani గురించి తెలుసుకుందాం!.

Mutton Biryani : బోన్‌లెస్ మ‌ట‌న్ బిర్యానీ త‌యారీ!

కావాల్సిన ప‌దార్థాలు
బోన్‌లెస్ మ‌ట‌న్ – అర‌కిలో
బాస్మ‌తి బియ్యం – అర‌కిలో
అల్లం వెల్లుల్లి ముద్ద – రెంటు టీ స్పూన్లు
ఉల్లిపాయ – ఒక‌టి
ధ‌నియాల పొడి – రెండు టీ స్పూన్లు
గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూను
కారం – ఒక టీ స్పూను
ప‌చ్చిమిర‌ప‌కాయ‌లు – నాలుగు
ల‌వంగాలు – ఐదు
దాల్చిన చెక్క‌లు – నాలుగు
కొత్త‌మీర క‌ట్ట – ఒక‌టి
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
ప‌సుపు – చిటికెడు
ఉప్పు – త‌గినంత‌
నూనె – స‌రిప‌డా.

Mutton Biryani: త‌యారు చేయు విధానం

ముందుగా బియ్యాన్ని క‌డిగి ఆర‌బెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి స‌రిప‌డా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్క‌లు, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద‌, ధ‌నియాల పొడి, ఉప్పు, కారం, ప‌సుపు వేసి బాగా వేగించాలి. త‌రువాత మ‌ట‌న్ వేసి బాగా ఉడికించి దించేయాలి. త‌రువాత మ‌రో మంద‌పాటి గిన్నె పెట్టి స‌రిప‌డా నూనె పోసి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద‌, ప‌చ్చిమిర‌ప కాయ ముక్క‌లు, ల‌వంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి.

త‌ర్వాత బియ్యం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, ఉప్పు వేసి బాగా క‌లిపి వేగించాలి. ఓ ఐదు నిమిషాలు వేగించాక ఉడికించిన మ‌ట‌న్ వేసి మ‌రో ఐదు నిమిషాలు వేగించాలి. త‌ర్వాత వంతుకు వంతున్న‌ర నీళ్లు పోసి ఉడికించి దించేయాలి. దించే ముందు కొత్తి మీర తురుము వేయాలి.

ఈ Munagaku Pachadi ఉప‌యోగాలేమిటో తెలుసా?

మున‌గాకు 300 జ‌బ్బుల్ని న‌యం చేస్తుందంటారు మ‌న పెద్ద‌లు. అది నిజం. అత్య‌ధిక పోష‌కాలు, విలువైన ఔష‌ధాలు క‌ల‌గ‌లిసిన అద్భుతం Munagaku. వారానికి క‌నీసం రెండుసార్లు ఏదో ఒక రూపంలో మున‌గాకు తింటే మీ ఆరోగ్యానికి Tirugu వుండ‌దు. ఇలా ప‌చ్చ‌డి చేసుకుతింటే ఇంకా Manchi ది.

ఒక గిన్నె నిండా తాజా మున‌గాకును తీసుకోవాలి. ఒక చెంచా ఉప్పు క‌లిపిన నీళ్ల‌లో మున‌గాకును శుభ్రంగా క‌డ‌గాలి. క‌డిగిన Munagaku ను చిన్న‌గా క‌ట్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. పాన్‌లో నాలుగు స్పూన్ల నూనె వేసి, ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి, ధ‌నియాలు, Pachi Mirchi వేసి వేయించి ఒక గిన్నెలో ప‌క్క‌కు తీసి పెట్టాలి. మ‌ళ్లీ అదే పాన్‌లోకి క‌ట్ చేసిన మున‌గాకు వేసి, కొద్దిగా నూనె పోసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *