Bone Less Mutton Recipe

Bone Less Mutton Recipe: బోన్‌లెస్ మ‌ట‌న్ వేపుడు ఎలా అంటే?

Spread the love

Bone Less Mutton Recipe | బోన్‌లెస్ మ‌ట‌న్ అంటే ఎవ‌రి ఇష్టం ఉండ‌దు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ క‌ర్రీని ఇష్టంగా తినేవారు ఉన్నారు. కానీ ఇది ఎలా చేసుకోవాలో కొంద‌రికి తెలియ‌దు. కాబట్టి బోన్‌లెస్ మ‌ట‌న్ వేపుడు ఎలా త‌యారు చేసుకోవాలి. Curryకి కావాల్సిన ప‌దార్థాలు ఏమిటివి, ఎలా త‌యారు చేసుకోవాలి అనేది కింద తెలిపాము.

Bone Less Mutton Recipe | కావాల్సిన ప‌దార్థాలు

బోన్‌లెస్ మ‌ట‌న్- అర‌కిలో
అల్లం ముద్ద‌- ఒక టీ స్పూను,
వెల్లుల్లి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూను
కారం – ఒక టీ స్పూను
ధ‌నియాల పొడి – రెండు టీ స్పూన్లు
ప‌సుపు – చిటికెడు
ఉల్లిపాయ‌లు – ఒక‌టి
చిన్న ఉల్లిపాయ‌లు – ఆరు
కొబ్బ‌రి తురుము – అర‌క‌ప్పు
గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూను
క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు
దాల్చిన చెక్క ముక్క‌లు – నాలుగు
ఉప్పు – త‌గినంత‌
నూనె – స‌రిప‌డా

త‌యారు చేయు విధానం

ముందుగా మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి, ధ‌నియాల పొడి వేసి మెత్త‌గా రుబ్బు కోవాలి. పొయ్యి మీద మంద‌పాటి గిన్నె పెట్టి స‌రిప‌డా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ గుజ్జు, ఉప్పు, కారం, ప‌సుపు వేసి బాగా వేగించి అందులో మ‌ట‌న్ ముక్క‌లు వేసి పూర్తిగా ఉడికాక ఉడికించి దించేయాలి. ఇప్పుడు మ‌రో గిన్నెలో స‌రిప‌డా నూనె పోసి కొబ్బ‌రి తురుము, క‌రివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి ముక్క‌లు, తొక్క తీసిన చిన్న ఉల్లిపాయ‌లు వేసి వేగించాలి. త‌రువాత ఉడికించిన మ‌ట‌న్‌, గ‌రం మ‌సాలా వేసి ఓ ఐదు నిమిషాలు వేగించి దించేయాలి.

Mutton Pakodi Recipe: మ‌ట‌న్ ప‌కోడీ త‌యారు చేయ‌డం ఎలా?

Mutton Pakodi Recipe:మ‌ట‌న్ ప‌కోడీ చేయ‌డం మీకు వ‌చ్చా! ఒక వేళ ఎలా త‌యారు చేయాలో తెలియ‌దా? అయితే ఇక్క‌డ మ‌ట‌న్ ప‌కోడీ ఎలా త‌యారు చేయాలో Read more

Ragi Halwa Recipe:రాగి హ‌ల్వా చేయ‌డం వ‌చ్చా మీకు!

Ragi Halwa Recipeశ‌రీరానికి శ‌క్తితో పాటు మంచి ఆరోగ్యంగా ఉండేందుకు స‌హాయ‌ప‌డే ఆహారంలో రాగుల‌ది ప్ర‌త్యేక పాత్ర ఉంది. రోజూ రాగులతో వండిన ఆహారం ఏదైనా రోజూ Read more

QUALITY ICE CREAM MAKE: ఇంటిలోనే ఐస్‌క్రీమ్ చేయ‌డం ఎలా?

QUALITY ICE CREAM MAKE: మ‌న ఇంటిలోనే ఐస్ చేసుకోవ‌డం ఎలానో ఇప్పుడు నేర్చుకోండి. పిల్ల‌లకు ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్ట‌ప‌డుతుంటారు. వారికి ఇంటిలోనే ఐస్‌క్రీమ్ చేసి Read more

banana ice cream recipe: అర‌టి పండు ఐస్‌క్రీమ్ ఎలా త‌యారు చేయాలి?

banana ice cream recipe: మ‌న ఇంటిలో పిల్ల‌ల‌కు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తారు. బ‌య‌ట‌కు వెళ్ళిన‌ప్పుడు కూడా ఐస్‌క్రీం అడుగుతుంటారు. కొన్ని సార్లు బ‌య‌ట Read more

Leave a Comment

Your email address will not be published.