Bejawada TDP

Bejawada TDP: కృష్ణా జిల్లా టిటిపిలో ముసలం

పొలిటిక‌ల్ స్టోరీలు

గెలుపు ఓట‌మిలు ప‌క్క‌కు నెట్టి పంతానికి, ప‌ట్టింపుల‌కు పోతున్న వైనం
మాజీ ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ వెర్సెస్ ఎంపీ
సొంత పార్టీలో ముస‌లంపై ప‌లువురు విమ‌ర్శ‌లు
విజ‌య‌వాడ టిడిపిలో తిరుగుబాటు?

Bejawada TDP: Vijayawada: కృష్ణా జిల్లాలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని అంత‌ర్గ‌త విమ‌ర్శ‌లు, వాదోప‌వాదాలు ప్ర‌స్తుతం రచ్చ‌కెక్కాయి. విజ‌య‌వాడ టిడిపిలో గ‌త కొన్ని రోజులుగా ర‌గులుతున్న విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో తెలుగు త‌మ్ముళ్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానిపై బోండా ఉమా, బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరాలు తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు. చంద్ర‌బాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే మేము పాల్గొన‌బోం అంటూ బ‌హిరంగంగా తెగేసి చెబుతున్నారు. మాకు అధిష్టానం చంద్ర‌బాబు త‌ప్ప ఎంపీ కేశినేని నాని కాద‌ని అంటున్నారు. కేశినేని నానీలాగా చీక‌టి రాజ‌కీయాలు తాము చేయ‌డం లేద‌ని, పార్టీ కోసం ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్టామ‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వాద‌నకు కార‌ణం చంద్ర‌బాబు రోడ్ షో మ్యాప్ మార్చ‌డంపై ఎంపీ కేశినేని నానీ మార్పులు చేయ‌డంతో తెలుగు దేశం నేత‌లు తిరుగుబాటు చేసిన‌ట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ముంగిట బెజ‌వాడ తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో తీవ్ర స్థాయిలో వ‌ర్గ విబేధాలు బ‌య‌ట‌కు పొక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న స‌మ‌యంలో ఈ స్థాయిలో పార్టీలో విబేధాలు పొచూప‌డం పార్టీకి న‌ష్ట‌దాయ‌క‌మ‌నే భావ‌న ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లోనూ, సానుభూతి ప‌రుల్లోనూ ఆవేద‌న క‌లిగిస్తోంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి రేపు ఆదివారం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌కు ఒక్క రోజు ముందే పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఈ స్థాయిలో దుమ్మెత్తి పోసుకోవ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. విజ‌య‌వాడ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కేశినేని శ్వేత‌ను ప్ర‌క‌టించ‌డం ఇష్టం లేని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌లు కేశినేని నానిపై తిరుగుబాటు చేస్తున్నారు.

చంద్ర‌బాబు నాయుడు తేల‌వాల్సిందే?

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడుకు తాము కావాలో లేక ఎంపీ కేశినేని నాని కావాలో తేల్చుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే బోండా పార్టీ అధినేత‌కు అల్టిమెల్టం జారీ చేశారు. కేశినేని ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేద‌ని, పార్టీ కోసం ప‌నిచేస్తోంది తామ‌ని, ప‌ద‌వుల కోసం ప‌నిచేస్తోంది నాని అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబుకు అంద‌రూ కావాలో కేశినేని కావాలో తేల్చుకోవాల‌ని తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌జారాజ్యంలో కూడా ఇదే తీరు?

ఎంపీ కేశినేని నాని గ‌తంలో ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించి ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి గెంటించుకున్నార‌ని, విజ‌య‌వాడ‌కు తానే అధిష్టాన‌మ‌ని కేశినేని మాట్లాడ‌టం ఆయ‌న అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌ని వారు అన్నారు. నాని కూతురిని మేయ‌ర్ చేయ‌డం కోసం దిక్కుమాలిన రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని బోండా ఉమా విమ‌ర్శించారు. కులాల మ‌ధ్య‌, పార్టీ నేత‌ల మ‌ధ్య చిచ్చు పెడుతున్నార‌ని, వ‌ర్గాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని అన్నారు. నిజ‌యంగా కేశినేని స‌త్తా ఉంటే ఏంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి గెల‌వాల‌ని, టిడిపి సిబంల్‌, చంద్ర‌బాబు ను చూసి నానికి ఓట్లు వేశార‌ని, ఇండిపెండెంట్‌గా కేశినేని నానికి గెలిస్తే తాను క‌ట్టుబ‌ట్ట‌ల‌తో విజ‌య‌వాడ‌ను వ‌దిలిపోతాన‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.

తెలుగుదేశం పార్టీ జెండా

చంద్ర‌బాబును ఏక‌వ‌చ‌నంతో పిల‌వ‌డం ఏమిటి?

ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న మాట్లాడుతూ..చంద్ర‌బాబు ను ఏక‌వ‌చ‌నంలో సంబోధించ‌డం, చిటికెలు వేసి విజ‌య‌వాడ‌కు తానే అధినేత అని అన‌డం ఆయ‌న అహంకారానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. టిడిపికి బీసీల‌ను దూరం చేస్తున్నార‌ని ఆయ‌న తీరు బాగాలేద‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు రోజులు స‌మ‌యం ఉంద‌నగా బెజ‌వాడ టిడిపిలో చెల‌రేగిన మంట‌లు ఆ పార్టీకి న‌ష్టం చేస్తుంద‌నే భ‌యం కార్య‌క‌ర్త‌ల్లో, సానుభూతి ప‌రుల్లో వ్య‌క్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి విజ‌య‌వాడ కార్పొరేష‌న్ లో టిడిపికి వంద‌శాతం అవ‌కాశం ఉంద‌ని, కానీ నాయ‌కుల మ‌ధ్య చెల‌రేగిన విబేధాల‌తో గెలిచే అవ‌కాశాన్ని చేజేతులారా పోగొట్టుకుంటున్నార‌నే ఆవేద‌న వారిలో వ్య‌క్తం అవుతుంది. కాగా కేశినేని ఆయ‌న వ్య‌తిరేకుల మ‌ధ్య ర‌గిలిన విబేధాల‌ను పార్టీ అధిష్టానం త్వ‌ర‌గా ప‌రిష్క‌రించి, అంద‌ర్నీ క‌లుపుకుని విజ‌య‌వాడ‌లో టిడిపి జెండా ఎగుర‌వేయాల‌ని స‌గటు కార్య‌క‌ర్త‌, అభిమానులు కోరుకుంటున్నారు.

ఇది చ‌ద‌వండి:రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన చిన్న‌మ్మ‌(శ‌శిక‌ళ)

ఇది చ‌ద‌వండి:10 life changing Principales

ఇది చ‌ద‌వండి: ఆ జంతువుకు నిజంగానే విముక్తి క‌లిగింది!

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *