Varavara Rao Interim Bail :Mumbai: ప్రజా నాయకుడు, కవి వరవరరావుకు ముంబై హైకోర్టులో బెయిల్ మంజూరు అయ్యింది. గత రెండున్నరేళ్లు క్రితం 2018 ఆగష్టు 25వ తేదీన వరవరరావును బీమా కోరెగావ్ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న వరవరరావుకు ఆరోగ్య పరిస్థితుల రిత్యా బెయిల్ మంజూరు అయ్యింది. ఆరు నెలల పాటు బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది. అయితే వరవరరావుకు బెయిల్ సమయంలో ముంబైలోనే ఉండాలని, విచారణకు అందుబాటులో ఉండాలని కోర్టు షరుతులు విధించింది.వరవరరావు వృద్ధాప్యం, ఆరోగ్య పరిస్థితులతో పాటు తలోజా జైల్ ఆసుప్రతిలో తగిన సౌకర్యాలు లేకపోవడాన్ని పరిగణిస్తూ బెయిల్ మంజూరు చేయడానికి కారణాలుగా భావిస్తున్నట్టు కోర్టు తెలిపింది.
వరవరరావుకు బెయిల్ రావడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసిన్నప్పటికీ కోర్టు పెట్టిన షరతులతో ఆయన ముంబైలోనే ఉండాలనేది వారికి సమస్యగా మారింది.జైలుకు వెళ్లిన వరవరరావు కేసు విషయంలో కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఐదు సార్లు కోర్టులో పిటిషన్లు వేశారు. అవన్నీ తిరస్కరించబడ్డాయి. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, కోవిడ్ రావడంతో గతేడాది ఆగష్టు నెలలో మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. హైకోర్టులో మూడు నెలలుగా ఈ విషయమై వాదనలు కొనసాగాయి. తొలుత వరవరరావును ఆస్పత్రిలో చేర్చాలని ముంబై కోర్టు తెలిపింది. నవంబర్ నుంచి నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.
ముంబైలోనే నివాసం!
వరవరరావుకు బెయిల్ మంజూరు అయినప్పటికీ అభిమానులు కాస్త అసంతృప్తిలోనే ఉన్నారు. షరతులతో బెయిల్ మంజూరు చేసి ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పరిధిలోనే ఉండాలని తెలిపింది. సందర్శకులను, అభిమానులను కలవని పరిస్థితి నెలకొంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కలవాలి. ముంబైలోని ఇల్లు తీసుకుని నివాసం ఉంటూ వాయిదాలకు తిరగాల్సి ఉంటుంది. వరవరరావుకు 80 ఏళ్లు, ఆయన భార్యకు 72 ఏళ్లు. ఇద్దరూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారికి తోడుగా ప్రస్తుతం ఎవ్వరూ లేరు. వాస్తవంగా వరవరరావుపై అబద్ధపు కేసు పెట్టారని కుటుంబ సభ్యులు పలు మార్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కొట్టి వేయాలని వారు పెద్దుఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
హైలెట్స్ :
- 2018 ఆగష్టు 25న బీమా కోరెగావ్ కేసులో వరవరరావు అరెస్టు అయ్యారు.
- అరెస్టును దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఖండించాయి.
- వరవరరావను వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.
- బెయిల్ కోసం కుటుంబ సభ్యులు పలు కోర్టుల్లో 5 సార్లు పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లు అన్నీ తిరస్కరించబడినాయి.
- గతేడాది తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో పాటు, కోవిడ్ భారిన పడ్డారు.
- నవంబర్ నుంచి నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.
- షరతులతో కూడిన బెయిల్‌ను ముంబై కోర్టు మంజూరు చేసింది.
- ముంబైలోనే నివాసం ఉంటూ వాయిదాలకు రావాలని కోర్టు తెలిపింది.
- బయట వ్యక్తులను కలవడానికి వీల్లేదన్ని పేర్కొంది.
- వరవరరావుకు మూత్ర సంబంధమైన ఇబ్బంది ఉంది.
ఇది చదవండి:కోవిడ్ వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల
ఇది చదవండి:ఖాకీ మాటున మానవత్వాన్ని చూపిన ప్రతి పోలీసుకు సెల్యూట్: డీజీపీ
ఇది చదవండి:మళ్లీ పంజా విప్పుతోన్న కరోనా
ఇది చదవండి: ‘ఉద్దానం’పై ఏం ఆలోచిస్తున్నారు: హైకోర్టు