Bomb Blast : అర్థరాత్రి బాంబు పేలుడు శునకం, వరహం మృతి!
Bomb Blast : తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. యూనివర్శిటీ ఆవరణంలో బుధవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో రెండు నాటు బాంబులు భారీ శబ్ధంతో పేలాయి. ఈ ఘటనలో ఓ శునకం, వరాహం మృతి చెందాయి.
యూనివర్శిటీ ఆవరణంలో ఐ – బ్లాక్ సమీపంలోఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే క్యాంపస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా బాంబులు ఉన్నాయేమోనని అనుమానంతో క్షుణ్ణంగా గాలించారు. యూనివర్శిటీలోఅడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు నాటు బాంబులను పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court