Boddu Thayathu: తాయత్తుని మనలో చాలా మంది అవహేళన చేస్తుంటారు. వెక్కిరస్తుంటారు. కానీ గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డును ఈ తాయత్తు (umbilical cord) లలో పెట్టి మొలతాడుకు కట్టేవారు. దానికే మరొక పేరు బొడ్డు తాయత్తు అని అంటారు. మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచడం కోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు (Boddu Thayathu) చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారట.
బొడ్డు తాయత్తు మహిమ!
స్థోమత ఉన్నవారు, వెండితాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే తాయత్తు మహిమ అనేవారు. ఈ తాయత్తు మహిమ అనే పదానికి అసలైన అర్థమిదే. ఈ బొడ్డు తాడును పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించ వచ్చట. కొన్ని రకాల క్యాన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలఖనాలు అవసరమవతాయి.
అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడు (Boddu Thayathu) ని దాస్తే, అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే, ఆపద సమయంలో వెతికే అవసరముండదు. త్వరగా దొరుకుతుంది. మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది.
ఆధునిక సైన్సు కూడా దీనినే నిరూపించి, ఈ స్టెం సెల్స్ (stem cells) క్యాన్సర్, జుట్టు ఊడిపోవడం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అందుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచడానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఈ రోజు అంటే ప్రస్తుత ఆధునిక యుగంలో ఒక బొడ్డుని భద్ర పరచ్చడానికి ఒక బ్యాంకు లాకర్ అద్దె సుమారు రూ.20,000 నుంచి రూ.40,000 వేల వరకు ఉంది. ఆ అవసరం లేకుండా తాయత్తు (Boddu Thayathu) లో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయ్యింది. అవహేళన చేయబడుతుంది. వెక్కరించబడుతుంది.