Blood Donation: రక్తదానం చేసి ఎంతో మంది జీవితాలకి కొత్త వెలుగు ఇస్తారు. ఎవరికైనా ప్రమాదాలు జరిగినప్పుడు, కొన్ని అనారోగ్య సమస్యలు కలిగినప్పుడు రక్తదానం చేయకపోతే వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది. ప్రాణదానం చేయడానికి మనం దేవుళ్లు కాము, డాక్టర్లు కాము. కానీ రక్తదానం చేయడంతో మనం వారి ప్రాణాల్ని కాపాడవచ్చు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రముఖులు వారి అభిమానులతో మంచిమార్గం ద్వారా రక్తదానం చేపిస్తున్నారు.
Blood Donation: రక్తదానం అనగానే మన తెలుగు రాష్ట్రల్లో గుర్తుకు వచ్చే ప్రముఖ హీరో మెగస్టార్ చిరంజీవి. 1998లో రక్తదాన శిబిరం(Chiranjeevi Blood Bank) పెట్టినప్పటి నుంచి కొన్ని లక్షల మందికి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అందజేశారు. చేపిస్తూనే ఉన్నారు. ఈ సేవలు వల్ల చిరంజీవి ఎంతో మంది ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నారు. అభిమానాన్ని చాటు కున్నారు. ప్రస్తుత కాలంలో యువ హీరోలు, రాజకీయ ప్రముఖులు కూడా వారి అభిమానుల సంఘాలతో ఉచిత రక్త శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే రక్తదానం చేయడం వల్ల రక్తం ఇచ్చే వారికి ఏదైనా నష్టం ఉంటుందా? అనే అపోహ కొంత మందిలో మెదిలాడుతూనే ఉంటుంది.
రక్తం ఇస్తే లాభమే తప్ప నష్టం లేదంటున్నారు వైద్య నిపుణులు. రక్తం మనం ఎవరికైనా ఇస్తే కేవలం 2 వారాల్లో తయారవుతుంటున్నారు. రక్తం దానం చేసినప్పటికీ మన బాడీలో ఉన్న ప్లాస్మా, నీళ్ల ద్వారా అవయవాలకు సరిపడే రక్తం సరఫరా అవుతుందని చెబుతున్నారు. ఇలా రక్త దానం చేయడం వల్ల మనకు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.
ప్రయోజనాలు!
1.రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది.
2.మన దగ్గర మన బాడీలో ప్రతి 3నెలలకొసారి కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది.
3.రక్తదానం చేయడం వల్ల కాలం చెల్లిన బ్లడ్ సెల్స్(blood cells) అన్నీ పోయి, కొత్త బ్లడ్ సెల్స్ పుడతాయి.
4.కొత్త రక్త కణాలు ఎప్పుడైతే శరీరంలో ఉత్పత్తి అవుతాయో బాడీ చాలా ఉత్సాహంగా ఉంటుంది.
5.రక్తం ఇవ్వక ముందు ఉన్న ఒత్తిడి, బలహీనతలు అన్నీ పోతాయి.
రక్తదానంతో ప్రపంచ రికార్డు సృష్టించిన సంపత్!


కోట శేష సంపత్ కుమార్ అనే వ్యక్తి 193 సార్లు రక్తదానం చేసి వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇలా 20 సంవత్సరాల నుంచి అడిగిన వారికి రక్తదానం చేస్తూ ప్రముఖలు, హీరోల ప్రశంసలు పొందారు. మెగస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు 137 సార్లు రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేస్తున్న సంపత్‌కు తమిళ నాడు యూనివర్శిటీ డాక్టరేట్ కూడా ప్రసాదించింది. సంపత్ రక్తదానం చేయడం వెనుక ఓ విషాధ గాధ ఉన్నదట. 20 ఏళ్ల కిందట గాంధీ ఆసుపత్రిలో రక్తం అందక వ్యక్తి చనిపోయినట్టు పత్రికల్లో వచ్చిన వార్త అతని మనసును కలిచివేసింది. అదే రోజు గాంధీ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసిన సంపత్ ప్రతి మూడ్నెళ్లకోసారి రక్తదానం చేస్తూనే ఉన్నారు. ప్రతి 15 రోజుకోసారి తెల్లరక్తకణాలను దానం చేస్తుంటారు. ఒమెగా, అపోలా లాంటి ఆసుపత్రుల్లో 56 సార్లు బ్లడ్ డోనేషన్ చేశారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!