blackmail : బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన మాజీ విలేఖరి అరెస్టు
blackmail :Eluru: బ్లాక్మెయిల్, ల్యాండ్ సెటిల్మెంట్ కేసులలో ప్రముఖ దినపత్రిక మాజీ విలేఖరి డి.బాలాజీ ని అరెస్టు చేసినట్టు ఏలూరు డిఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ..ఏలూరు రూరల్ ఎస్సై చావా సురేష్‌పై దాడి చేసిన ఘటనలో మాజీ విలేఖరి డి.బాలాజీ ని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. విచారణలో భాగంగా బాలాజీ ఫోన్ డేటా పరిశీలిస్తే..వ్యభిచారం, క్రికెట్ బెట్టింగ్, కాల్ మనీ, పోలీసు అధికారులను బ్లాక్ మెయిలింగ్(blackmail), ఏలూరు నగరంలో పెద్ద పెద్ద భవనాలకు పర్మీషన్ లేదంటూ యజమానులను బెదిరించడంతో డబ్బులు సంపాదించడమే పనిగా మాజీ విలేఖరి బాలాజీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు. బాలాజీకి సహకరించిన వారిలో పోలీస్ డిపార్ట్ మెంట్‌కు చెందిన వ్యక్తులు, వివిధ రంగాలలో పనిచేసే మరికొంత మంది వ్యక్తులు ఉన్నట్టు గుర్తించామని డిఎస్పీ తెలిపారు.
బాలాజీ అకౌంట్లో కోటి రూపయాల పైచిలుకు నగదును గుర్తించామని పేర్కొన్నారు. బాలాజీకి సహకరించిన కేసులో మరికొంత మందిని త్వరలోనే అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెడతామని ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు.
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు
ఇది చదవండి:శశికళకు అనుమతి ఇవ్వని ఏఐఏడింకే ప్రభుత్వం!
ఇది చదవండి:నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త!
ఇది చదవండి:టీచర్లను ఇవ్వండి..ఓట్లేస్తాం..!
ఇది చదవండి: వైద్య అవినీతిపై సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆరా?