Blackmail

Blackmail : బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డిన విలేక‌ర్లు అరెస్టు

Spread the love

రిమాండ్‌కు తర‌లింపు : క‌ల్లూరు ఏసీపీ

Blackmail : kalluru : విలేక‌ర్ల ముసుగులో అక్ర‌మ దందాలు కొన‌సాగిస్తూ బ్లాక్‌మెయిలింగ్ కు పాల్ప‌డుతున్న నాలుగు విలేక‌ర్ల‌పై సత్తుప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్టు క‌ల్లూరు ఏసీపీ వెంక‌టేశ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ద‌మ్మ‌పేట మండ‌లం మంద‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన క‌ఠారి పుల్లారావు బుధ‌వారం రాత్రి స‌మ‌యంలో 10 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో బైపాస్ రోడ్డు వైపుగా త‌ర‌లిస్తుండ‌గా కొంద‌రు విలేక‌ర్లు ఆటోను అడ్డ‌గించి తాము విలేక‌రుల‌మంటూ బెదిరించారు. మాకు రూ.30 వేలు ఇవ్వాల‌ని, డ‌బ్బులు ఇవ్వ‌కుంటే నీ అంతుచూస్తామ‌ని అన్న‌ట్టు బాధితుడు చెప్పార‌న్నారు. అత‌ని వ‌ద్ద రూ.24 వేల న‌గ‌దును లాక్కున్నార‌ని, మిగిలిన రూ.6 వేలు ఇచ్చి ఫోన్ తీసుకెళ్ల‌మ‌ని , స్మార్ట్ ఫోన్ లాక్కెళ్లార‌ని పుల్లారావు ఫిర్యాదు చేయ‌డంతో స‌త్తుప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు.

విచార‌ణ‌లో ఐన్యూస్ రిపోర్ట‌ర్ మ‌రియు సుభ‌నంద‌ని చిట్ ఫండ్ మేనేజ‌ర్ త‌డిక‌మ‌ల్ల అప్పారావు, మెట్రో న్యూస్ పేప‌ర్ రిపోర్ట‌ర్ చింతోజీ ర‌మేష్‌, ప్ర‌జాప‌క్షం న్యూస్ రిపోర్ట‌ర్ ఐదుపాలాపాటి కృష్ణ‌, ప్ర‌జా కలం న్యూస్ పేప‌ర్ రిపోర్ట‌ర్ కొమ‌రాపు వాసుదేవ గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు త‌ర‌లించామ‌న్నారు. స‌త్తుప‌ల్లిలో ఇటీవ‌ల కొంత‌మంది న‌కిలీ విలేక‌ర్లు ప్ర‌ముఖ దిన‌పత్రిక‌ల్లో, న్యూస్ ఛానళ్ల‌లో ప‌నిచేసే పాత్రికేయుల పేరు వాడుకోవ‌డంతో పాటు తాము ఓ ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్‌కు, దిన‌ప‌త్రిక‌కు జిల్లా, డివిజ‌న్ స్థాయి విలేక‌ర్ల‌మంటూ వ్యాపారుల‌ను, కాంట్రాక్ట‌ర్ల‌ను కార్యాల‌యాల్లో అధికారుల‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ, వ‌సూళ్ల బాగోతానికి పాల్ప‌డుతున్న‌ట్టు ప్ర‌ముఖ ప‌త్రిక‌లు, న్యూస్ ఛాన‌ల్ రిపోర్ట‌ర్లు వాపోతున్నార‌ని అన్నారు. విలేక‌ర్ల ముసుగులో అక్ర‌మ దందాల‌తో అందిన కాడికి దండుకోవ‌డం రివాజుగా మారింద‌నే తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇలాంటి చ‌ట్ట‌విరుద్ధంగా చ‌ర్య‌ల‌ను ఉపేక్షించేది లేద‌ని ఏసీపీ ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. అదేవిధంగా విలేక‌ర్లు కాని కొంత‌మంది ద్విచ‌క్ర వాహ‌నాల‌కు, కార్ల‌కు ప్రెస్ స్టిక్క‌ర్లు అంటించుకుని, నకిలీ ఐడి కార్డులు త‌యారు చేసుకుని అక్ర‌మ దందాలు కొన‌సాగిస్తున్న‌ట్లు ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని ఏసీపీ అన్నారు. అలాంటి వారిని ఊపేక్షించేది లేద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో బియ్యం త‌ర‌లిస్తున్న ఆటోను బియ్యాన్ని సివిల్ సప్ల‌య్ అధికారుల‌కు స్వాధీనం చేయ‌డం జ‌రిగింద‌ని ఈ మేర‌కు కేసు న‌మోదు చేసిన సీఐ ర‌మాకాంత్ ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

ఇది చ‌ద‌వండి:ప్ర‌స్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!

ఇది చ‌ద‌వండి:వైభ‌వంగా ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాలు

ఇది చ‌ద‌వండి:పాత్ర‌లో లీన‌మై నిజంగానే చంప‌బోయిండు!

ఇది చ‌ద‌వండి:మ‌ర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

TS News:విక‌లాంగుడిగా పుట్ట‌డ‌మే పాప‌మా..? ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పూనుకున్న ఓ వ్య‌క్తి

TS Newsవ‌రంగ‌ల్: త‌న భూమిలో అక్ర‌మంగా బోరు వేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట మంగ‌ళ‌వారం పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు Read more

Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!

Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం! Guntur : గుంటూరు జిల్లాలో స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై Read more

drinking pesticide : కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు క‌లుపుకొని..!

drinking pesticide : కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు క‌లుపుకొని..! drinking pesticide : అనారోగ్యం కార‌ణంగా వృద్ధ దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఆదివారం తిరుప‌తిలో Read more

money burning : రూ.5 ల‌క్ష‌లు కాల్చివేసిన టిఆర్ఎస్ నేత | Veldanda Nagarkurnool

money burning : రూ.5 ల‌క్ష‌లు కాల్చివేసిన టిఆర్ఎస్ నేత | Veldanda Nagarkurnool money burning : ఏసీబీ అధికారులు త‌న ఇంటి మీద దాడుల‌కు Read more

Leave a Comment

Your email address will not be published.