Draupadi Murmu | ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మహిళలకు అవకాశం కల్పిస్తామని ఎన్డీయే గిరిజన మహిళ Draupadi Murmu పేరును ప్రకటించింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ద్రౌపది ముర్మను రాష్ట్రపతి అభ్యర్థి(bjp president candidate draupadi murmu)గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు మాత్రం ఎన్నికలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. విపక్షాలు తమ అభ్యర్థిగా టీఎంసీ మాజీ నేత, కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపుతున్నాయి. బీజేపీ ద్రౌపది ముర్ముని రంగంలోకి దించింది. మంగళవారం జరిగిన బీజేపీ పార్టీ సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి Amit Shah, నితిన్ గడ్కరీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.
BJP పార్లమెంటరీ బోర్డు సమావేశంలో దాదాపు 20 మంది పేర్లను చర్చించి గిరిజన మహిళా నేత ముర్ము పేరును ఖరారు చేశారు. ఈ సమావేశం అనంతరం జార్ఞండ్ మాజీ గవర్నర్ Draupadi Murmu ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అని జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. బీజేపీ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ పార్లమెంటరీ బోర్డు సమావేశం మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.
రామ్‌నాథ్ పదవీ కాలం ముగింపు
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. తదుపరి రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ పత్రాలు దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ. ఉదయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును కలిశారు. దీని తర్వాత అతని పేరు ఊహాగానాలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. మొత్తంగా ద్రౌపది ముర్మును బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది.