Warangal: BJP leaders have expressed concern over the vaccination | వ్యాక్సినేషన్ వద్ద బీజేపీ నేతల ఆందోళన
Warangal: BJP leaders have expressed concern over the vaccination | వ్యాక్సినేషన్ వద్ద బీజేపీ నేతల ఆందోళన Warangal : వరంగల్ ఎంజీఎం వ్యాక్సినేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు శనివారం ఆందోళన చేపట్టారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఫొటో లేకుండా ఫెక్లీలు ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీలను చించివేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడితే, వరంగల్ లో మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాని ఫొటో లేకుండా కార్యక్రమం చేపట్టడం దారుణమని అన్నారు.
దేశవ్యాప్తంగా కరోనాను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నారని, అలాంటి మహనీయుడు ఫొటో లేకుండా టిఆర్ఎస్ నేతలు ఏకపక్షంగా రాజకీయం చేసి ఇలా చేశారని ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ఫొటో లేకుండా ప్రారంభించడాన్ని ఖండిస్తున్నామన్నారు. సొమ్ము బీజేపీది అయితే సోకు టిఆర్ఎస్ పార్టీది అన్నచందంగా టీకా కార్యక్రమం ఉందని విమర్శించారు.
ఈ విషయంలో కలెక్టర్ జిల్లా కలెక్టర్ స్పందించాలని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో శాంతియుత ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో చర్యలు తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం నరేంద్ర మోడీ లేని ఫ్లెక్సీలను బీజేపీ ఆందోళన కారులు చించి వేశారు.
ఇది చదవండి: ఇసుక టిప్పర్ రూపంలో కబళించి మృత్యువు
ఇది చదవండి: వ్యాక్సినేషన్..రూల్స్ మీకు తెలుసా!