Bitter Gourd: రుచికి చేదైనా..ఆరోగ్యానికి తీపి కాక‌ర‌కాయ‌

Bitter Gourd: కాక‌ర‌కాయ ఈ పేరు వింటేనే ఈ రోజు నాకు అన్నం వ‌ద్దు..అనే పిల్ల‌లు ఉన్నారు, అమ్మో ఎలా తినాలి? అనే పెద్ద‌వారూ ఉన్నారు. కాక‌ర‌కాయ‌లు చేదు గుళిక‌ల్లా ఉంటాయి కాబ‌ట్టి చాలా మంది వాటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ ఆరోగ్యానికి చేసే మేలు ఎంత చెప్పినా త‌క్కువే. రుచికి చేదైనా ఆరోగ్యానికి తీపిగా ఉండే కాక‌ర‌కాయ (Bitter Gourd) ఉప‌యోగాలు గురించి తెలుసుకుందాం!.

Bitter Gourd | ఔషధాల విప‌ణి కాక‌ర‌!

కాక‌ర‌కాయ‌ల్లో చాలా ర‌కాలు ఉన్నాయి. ఇది ఎక్కువ‌గా మ‌న భార‌త‌దేశంలోనే ల‌భిస్తుంది. తీగ‌జాతికి చెందిన ఈ కూర‌గాయ పొడుగు, పొట్టి ర‌కాల‌లో ల‌భిస్తుంది. కాక‌ర‌కాయ కూర వండుకోవ‌డానికే కాదు వైద్యానికి ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కాక‌ర‌కాయ‌తో ఎన్నో ర‌కాలైన వంట‌ల‌ను త‌యారు చేస్తారు. కాక‌ర‌కాయ‌ను గుండ్రంగా చ‌క్రాల్లా స‌న్న‌గా కోసి, ఆ ముక్క‌ల‌కు #ఉప్పు రాసి కొంచెం సేపు ఉంచి, ఆ త‌ర్వాత నీటిని పిండేసి, వేపుడు కూర చేస్తే చేదు లేకుండా, క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉంటుంది.

అదే విధంగా గుండ్రంగా ముక్క‌లు కోసి, ఉల్లిపాయ‌, ట‌మాటా ముక్క‌ల‌ను కూడా వీటితో క‌లిపి కూర చేసిస్తే కూర చేదుగా ఉండ‌దు. చింత‌గుజ్జు, బెల్లం వేసి కూర చేస్తారు. కాక‌ర‌కాయ‌ను స‌న్న‌ని ముక్క‌లు చేసి, ఉప్పునీటిలో ఉడికించి, ఆ నీరు తీసేసి తాలింపులో వేసి కొబ్బ‌రి పొడి, సెన‌గ‌పిండి చ‌ల్లి వండితే కూర ఎంతో రుచిగా ఉంటుంది. కాక‌ర‌కాయ ముక్క‌ల‌ను తిరిగి ఎండ‌లో పెట్టి ఒరుగుల్లా త‌యారు చేయ‌వ‌చ్చు. మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చు.

ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది!

పండిన కాక‌ర‌కాయ ముక్క‌ల‌ను నూనెలో మ‌గ్గించి, చింత‌పండు, కొంచెం బెల్లం, ఉప్పు వేసి పోపు దినుసుల‌తో చ‌ట్నీ చేయ‌వ‌చ్చు. అదే విధంగా ఔష‌ధ‌ప‌రంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా మ‌ధుమేహ రోగుల‌కు ఇది దివ్యౌష‌ధంలా ప‌నిచేస్తుంది. ర‌క్తంలో చ‌క్కెర శాతం త‌గ్గాలంటే కాక‌ర ర‌సాన్ని #ఔష‌ధం లా తీసుకోవ‌చ్చు. లేదా ఆహార ప‌దార్థాల్లో కాక‌ర‌కాయ‌ను చేర్చ‌వ‌చ్చు. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది. ర‌క్త సంబంధిత అనారోగ్యాల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తుంది.

శ‌రీరంలో ఇన్సులిన్ విడుద‌ల కావ‌డాన్ని పెంచుతుంది. ఆక‌లిని బాగా వృద్ధి చేస్తుంది. జీర్ణ‌క్రియ‌కు తోడ్ప‌డుతుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. కంటిచూపును వృద్ధి చేస్తుంది. కంటికి అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది. ఆహారం అరిగేలా, వంట‌బ‌ట్టేలా చేస్తుంది. శ‌రీరానికి విష‌ప‌దార్థాల ప్ర‌భావం నుంచి ర‌క్ష‌ణ క‌లిగిస్తుంది. ర‌క్త‌దోషాల నివార‌ణ‌కు తోడ్ప‌డుతుంది. చ‌ర్మ‌వ్యాధుల‌ను నివారించే గుణం కాక‌ర‌ (Bitter Gourd)లో ఉంది. అధిక ర‌క్త‌పోటును అదుపులో ఉంచుతుంది.

kakarakaya

ప్ర‌తిరోజూ మ‌జ్జిగ‌లో #కాక‌ర ర‌సాన్ని క‌లిపి తాగుతుంటే మొల‌ల స‌మ‌స్య‌కు నివార‌ణ క‌లుగుతుంది. మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని పోగొడుతుంది. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాతాన్ని అరిక‌డుతుంది. వాత‌వ్యాధులు ఏర్ప‌డ‌కుండా కాపాడుతుంది. క‌డుపులోని నులిపురుగుల‌ను సంహ‌రిస్తుంది. క‌ఫాన్ని క‌రిగిస్తుంది. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిన‌ప్పుడు ఇది ఔష‌ధంగా ఉప‌యోగిస్తుంది.

Share link

Leave a Comment