Biryani Leaf: బిర్యానీ ఆకును మనం ఆహారంలోకి తీసుకుంటాం. బిర్యానీ అన్నం చేయాలంటే తప్పనిసరిగా బిర్యానీ ఆకును ఉపయోగించాల్సిందే. ఆకుతోనే బిర్యానీ సువాసన గుబాళింపు చేస్తుంది. అయితే బిర్యానీ ఆకును తినడమే కాకుండా ఆరోగ్యానికి అదీ షుగర్ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందట. అది ఎలానో తెలుసుకుందాం!.
Biryani Leaf | బిర్యానీ ఆకుతో షుగర్ వ్యాధి పరార్!
మన భారత దేశంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య షుగర్. ఇది వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. షుగర్ వ్యాధి వచ్చిన వారు ఏది తినాలన్నా భయపడుతుంటారు. ప్రతిరోజూ ఇంగ్లీష్ మందులు వాడితే తప్ప షుగర్ నయం కాదనే అపోహ ఉంది. ఒక్క రోజు షుగర్ లెవల్స్ పెరిగాయంటే మనకు కంగారు కలుగుతుంది. షుగర్ వ్యాధికి మందులు తక్షణ ఉపశమనం ఇస్తుంది తప్ప, పూర్తిగా నయం చేయలేవు. కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
బిర్యానీ ఆకు (Biryani Leaf) షుగర్ తగ్గించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందట. ఈ ఆకును రెండు సార్లు వాడితే షుగర్ నియంత్రణలోకి వస్తుందట. ప్రయోగాత్మకంగా రుజువు కాబడిన వివరాలను వాటి ఫలితాలను ఇక్కడ తెలుసుకుందాం. బిర్యానీ ఆకు ద్వారా తయారు చేయాల్సిన పదార్థం గురించి కింద చూపిన విధంగా తయారు చేసుకోవాలి.
తయారీ విధానం
ఒక గిన్నెలోకి 10 బిర్యానీ ఆకులు (bay leaf) తీసుకోవాలి. 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాలు మరగించాలి. తర్వాత స్టవ్ నుంచి దించి 2, 3 గంటల పాటు మగ్గనివ్వాలి. ఇక ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు 3 సార్లు తాగాలి. ఉదయం ఒక సారి ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు.
ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనానికి 1 గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా వరుసగా 3 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. 2 వారాలు గ్యాప్ ఇచ్చి మల్లీ 3 రోజులు క్రమంగా వాడాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు షుగర్ నియత్రణలోకి వస్తుందట.
ప్రయోజాలు ఏమిటంటే?
బిర్యానీ ఆకు (Biryani Leaf) రసం తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమ బద్ధం చేయడంతో డయాబెటిస్ కంట్రోల్‌లోకి వస్తుంది. గుండె జబ్బులు కూడా రావు. క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని శరీరానికి అందిస్తుంది.