Birthday Rave Party: గుంటూరు జిల్లాలోని రేవ్ పార్టీ కల్చర్ కలకలం రేపింది. జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెంన్షన్ వేటు పడింది.
గుంటూరు: నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న తెలుగించి రుచులు రెస్టారెంట్లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడంతో పాటు విజయవాడ నుంచి ఆరుగురు యువతులను పిలిపించి అసభ్య నృత్యాలు చేపించారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించడం, అధిక శబ్ధాలతో ఇతులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించడం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేశారు. అయితే వారిని సొంత పూచీకత్తులపై పంపించి వేశారు. అయితే జరిగిన పార్టీకి అర్బన్ సీసీఎస్‌లో పనిచేస్తున్న సీఐ వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఒకేసారి ఆరుగురు యువతులు, 19 మంది యువకులను తీసుకుని రావడంతో రేవ్ పార్టీ జరిగిందట. ఈ ఘటనపై ఆరా తీసిన ఉన్నతాధికారులు సీఐపై సస్పెంన్షన్ వేటు వేశారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!