Biosphere Reserves in India 2022 | బయోస్పియర్ రిజర్వులను UNESCO వారు 1971లో (Man And Biosphere-MAB) మానవుడు మరియు జీవగోళం లో భాగంగా 1974లో ప్రవేశపెట్టారు. వీటిలో వన్యసమాజాలతో పాటుగా, మచ్చిక చేయబడ్డ, జంతువులు,వృక్షాలు అక్కడ నివసించే గిరిజనుల జీవన విధానం కూడా పరిక్షించబడుతుంది. ఈ బయోస్పియర్ రిజర్వులకు సరిహద్దులు పరిమితమై ఉండవు. ఇవి చాలా విశాలమైనవి. మన దేశంలో 1986లో Biosphere Reserve Programm ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 18 బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేయడమైనది.
ఇండియాలో మొదటి బయోస్పియర్ రిజర్వు నీలగిరి బయోస్పియర్ రిజర్వుగా (1986) గుర్తింపు పొందగా, చివరగా ఏర్పడిన బయోస్పియర్ రిజర్వు పన్నా బయోస్పియర్ రిజర్వు 2011 ఏర్పడింది. దేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వు కచ్ బయోస్పియర్ రిజర్వు(గుజరాత్) గుర్తింపు పొందింది. అతి చిన్న బయోస్పియర్ రిజర్వుగా డిబ్రూ సాయికోవా Biosphere Reserves (అసోం) లో ఉంది. ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వుల్లో 12ను మాత్రమే UNESCO గుర్తించింది. బయోస్పియర్ రిజర్వులో మూడు జోన్లు ఉన్నాయి. 1.కేంద్ర మండలం 2. బఫర్ ప్రాంతం 3. పరివర్తన మండలం.
కేంద్ర మండలం– ఇది పూర్తిగా మానవ అంతర చర్యలు లేని భాగం. ఒక బయోస్పియర్ రిజర్వులో ఒకటి లేదా ఎక్కువ కేంద్ర మండలాలు ఉంటాయి. ఇక్కడ ఎలాంటి ఆర్థిక, సాంస్కృతిక పరమైన కార్యకలాపాలు నిర్వహించబడవు.
బఫర్ జోన్– ఇది కేంద్ర మండలాన్ని చుట్టి ఉంటుంది. పరిశోధన, విద్య, శిక్షణ వంటి అంశాలు ఈ ప్రాంతంలో అనుమతించబడును.
పరివర్తన మండలం– ఇది బఫర్ మండలాన్ని చుట్టి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రదేశం. దీనిలో పర్యాటకమైన మౌళిక వసతులు ఏర్పాటు చేసి ఉంటాయి.


Biosphere Reserves in India 2022
బయోస్పియర్ రిజర్వ్ | ఏర్పాటైన సంవత్సరం | విస్తరించిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు | UNESCO లభించిన సంవత్సరం |
1.నీలగిరి | 1986 | తమిళనాడు, కర్ణాటక, కేరళ | 2000 |
2.నందాదేవి | 1988 | ఉత్తరాఖండ్ | 2004 |
3.నాక్రెక్ | 1988 | మేఘాలయ | 2009 |
4.గ్రేట్,నికోబార్ | 1989 | అండమాన్ మరియు నికోబార్ | 2013 |
5.గల్ఫ్ ఆఫ్ మన్నార్ | 1989 | తమిళనాడు | 2001 |
6.మానస్ | 1989 | అసోం | గుర్తించలేదు |
7.సుందర్బన్స్ | 1989 | పశ్చిమబెంగాల్ | 2001 |
8.సిమ్లిపాల్ | 1994 | ఒడిషా | 2009 |
9.దిబ్రూ-సాయికోవా | 1997 | అసోం | గుర్తించలేదు |
10.దిహంగ్-దిబాంగ్ | 1998 | అరుణాచల్ ప్రదేశ్ | గుర్తించలేదు |
11.పంచమర్హి | 1999 | మధ్యప్రదేశ్ | 2009 |
12.కాంచనజంగ | 2000 | సిక్కిం | 2018 |
13.అగస్యమలై | 2001 | కేరళ | 2016 |
14.అచనక్మర్-అమర్‌కంఠక్ | 2005 | మధ్యప్రదేశ్ | 2012 |
15.శీతల ఎడారి | 2009 | హిమాచల్‌ప్రదేశ్ | గుర్తించబడలేదు |
16.కచ్ | 2010 | గుజరాత్ | గుర్తించబడలేదు |
17.శేషాచలం | 2010 | ఆంధ్రప్రదేశ్ | గుర్తించలేదు |
18.పన్నా | 2011 | మధ్యప్రదేశ్ | 2020(అక్టోబర్) |