bill gates tweet క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకలను చేసుకోవడానికి ఒమిక్రాన్ పెద్ద సాతానులా దాపురించిందని ప్రపంచ దేశాలు నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కంటే ఒమిక్రాన్ వేగంగా విస్తరించి, కేసుల సంఖ్య పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ క్రమంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడు బిల్గేట్స్ ఒమిక్రాన్(Omicron)పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. (bill gates tweet)ఆ వ్యాఖ్యలు ఏమిటంటే..
అయితే ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని బిల్గేట్స్(bill gates) ఓ ప్రకటన చేశారు. ఆయన ఈ ప్రకటన చేసిన రెండ్రోజుల్లో పరిస్థితి మొత్తం తారుమారయ్యింది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు భారీగా వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. దీంతో బిల్గేట్స్ తన ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం దారుణమైన దశకు చేరుకుంటుందని, భవిష్యత్తు రోజులు మరింత కీలకంగా మారనున్నాయని తెలిపారు. వచ్చే 2022 సంవత్సరంలో అన్ని దేశాలు అన్ని రంగాల్లో సంక్షోభాల్ని ఎదుర్కొనక తప్పదని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ…సెలవు దినాల్లో తన బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతామను కున్నానని, కానీ తన సన్నిహితులు, బంధువులు సైతం ఒమిక్రాన్ బారిన పడటం బాధాకరమని అన్నారు. అందుకనే అన్ని రకాల కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు చరిత్రలో ఏ వైరస్సూ ఒమిక్రాన్ అంతటి వేగంగా విస్తరించలేదని, అన్ని దేశాలను ఒమిక్రాన్ చుట్టేస్తోందని పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలను అందరూ పాటిస్తే 2022వ సంవత్సరంలో బయటపడే అవకాశం ఉంటుందని బిల్గేట్స్ తెలిపారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి