Bilkis Bano #బిల్కిస్ బానో కి జ‌రిగింది న్యాయ‌మేనా?

Bilkis Bano: ఈ ఉదయం శుభోదయమా మీరే చెప్పండి??, ఈమెకి జరిగింది న్యాయమా అన్యామా??, ఐదు నెలల గర్భిణీని 11మంది సామూహిక అత్యాచారం చేయడం న్యాయమా??, తన మూడేళ్ళ కూతురిని దారుణంగా హతమార్చడం న్యాయమా??, ఏడుగురి కుటుంబ సభ్యులని హత్య చేయడం న్యాయమా??, ఈ 11మందిని 15ఏళ్ళ తరువాత “సతప్రవర్తన” కింద ఆగస్టు 15 2022 విడుదల చేయడం న్యాయమా??,ఎవరికి జరిగింది న్యాయం??.

Bilkis Bano: ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు చెబుతారు సమాధానం?

ఓ నా పవిత్ర భారత దేశామా
ఎక్కడ నేను గర్వపడాలి నిను చూసి నేను
న్యాయానికి సంకెళ్లు వేస్తున్న మత పిచ్చికా
ఆడదానికి భద్రత లేని కేంద్రాన్నా
గమ్మున కూచ్చున్న నా అన్నదమ్ములనా
గరం గరం నెత్తురుతో నరం తెగి పడని నా “నారి” లోకన్నా?
దేన్నీ చూసి నేను గర్వపడాలి?

కిమ్మనని ఈ సమాజన్నా? దేన్నీ చూసి నేను గర్వపడాలి?
తెల్ల దొరల నుండి 75ఏళ్లుగా నల్ల దొరల చేతులు మారిని ఈ భారతన్నా??
స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా విడుదలైన అన్యాయాన్నా??
చివరికి న్యాయమే గెలుస్తుంది అనే నానుడికా?
దేన్నీ? దేన్నీ చూసి నేను గర్వపడాలి??

Bilkis Bano: నా కధ చదివాక కూడా నాకు జరిగింది అన్యాయం అని గుర్తించని ఈ గొడ్డుబోయిన గుడ్డి సమాజానికి??

దేన్నీ చూసి నేను గర్వపడాలి??

నేను గర్వపడుతున్న నా గుండె ధైర్యానికి!
నేను గర్వపడుతున్న కులం మతం సంబంధం లేని ప్రశ్నించే హక్కుని కల్పించిన నా రాజ్యంగానికి!
ఆ రాజ్యంగాన్ని నాకందించిన అంబెడ్కర్ ఆలోచనకి ఆచరణకి!
నేను గర్వపడుతున్న నా ఆత్మ విశ్వాసానికి!
జీవితంతో పోరాడలేక అబలలా ఆత్మహత్యని ఆశ్రయించని నన్ను చూసి నేనే గర్వపడుతున్న!
ఎంతని రాయను ఏమని రాయను నా దేశ సంస్కృతి సంప్రదాయాలను వేదన భరిత హృదయంతో…

Leave a Comment